Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దిగ్గజ టెక్ ఉత్పత్తుల కంపెనీ ఆపిల్ భారత మార్కెట్‌పై ప్రధాన దృష్టి పెట్టిం ది. దేశంలో తన తొలి సొంత స్టోర్‌ను ముంబయిలో ఏర్పాటు చేస్తుంది. మంగళవారం దీన్ని ఆపిల్ సిఇఒ టిమ్ కుక్ లాంఛ నంగా ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 20న ఢిల్లీలో తన రెండో స్టోర్ తెరవనుంది. ఆపిల్ ఎప్పటి నుంచో భారత్‌లో తమ ఉత్పత్తులను విక్ర యిస్తోంది. రిటైల్ స్టోర్‌లో కస్టమర్లు ఆపిల్ ఉత్పత్తులను సందర్శించడానికి కొనుగోలు చేయడానికి వీలుంటుంది. ఈ రిటైల్ స్టోర్‌లో పనిచేసే 100 కంటే ఎక్కువ మంది సిబ్బంది ఉండటంతో పాటుగా.. వారు ఏకంగా 20కి పైగా భాషల్లో వినియోగదారులకు సేవలందించనున్నారు. దేశవ్యాప్తంగా వేలాది ఉద్యోగాల సృష్టికి కట్టుబడి ఉన్నామని ఆ సంస్థ పేర్కొంది.