Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: భారతదేశంలోని అతిపెద్ద పేమెంట్స్ యాప్ అయిన ఫోన్ పే వినియోగదారులు, మర్చంట్లు లాంటి వారికి డిజిటల్ పేమెంట్ల సౌకర్యాన్ని అందిస్తోంది. నగదు బదిలీల నుండి రీఛార్జీలు, అలాగే విద్యుత్, ఇతర వినియోగ బిల్లులను చెల్లించడం, ఇన్సూరెన్స్ కొనడం, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి పెట్టడం వరకు అనేక రకాల సేవలను అందిస్తోంది. ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు ఫోన్ పేను విశ్వసిస్తున్నారు. మీ లోన్ ఈఎంఐ పే చేయాలనుకుంటున్నారా? ఫోన్ పే దీని సౌకర్యవంతంగా, సులభంగా చేసింది.
మీరు చేయాల్సింది...
1వ దశ .. ఫోన్ పే యాప్ తెరవండి. హెూమ్ పేజీలో రీఛార్జ్ అండ్ పే బిల్స్, బిల్లులు చెల్లించు'కు వెళ్లండి. ఆర్థిక సేవ అండ్ పన్నుల కింద లోన్ రీ పేమెంట్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
2వ దశలో... మీ లోన్ బిల్లర్‌ను ఎంచుకోండి.
3వ దశలో మీ లోన్ ఖాతా నెంబర్‌ను ప్రవేశపెట్టండి.
4వ దశలో మీకు నచ్చిన పేమెంట్ పద్ధతితో పేమెంట్‌ను పూర్తి చేయవచ్చని ఆ సంస్థ తెలిపింది.