Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో పెరుగుతున్న హెచ్3ఎన్2 కేసులు. ఇతర రకపు ఫ్లూ ఇన్ఫెక్షన్ల కంటే కూడా ఎక్కువగా హాస్పిటలైజేషన్కు కారణమవుతున్నాయి
నవతెలంగాణ - హైదరాబాద్
ఐసీఎంఆర్ ఇటీవల కాలంలో విడుదల చేసిన నివేదికల ప్రకారం హెచ్3ఎన్2 వైరస్ కారణంగా సంభవిస్తున్న ఫ్లూ దేశంలో వేగంగా విస్తరిస్తుంది. ఈ వైరల్ ఉత్పరివర్తనం (స్ట్రెయిన్) కారణంగా దీర్ఘకాలపు అనారోగ్యం కలగడంతో పాటుగా ఇతర ఫ్లూ వైరస్ల కారణంగా వచ్చే అంటువ్యాఽధులతో పోలిస్తే హెచ్3ఎన్2 కారణంగా ఎక్కువ మంది హాస్పిటల్లో చేరాల్సి వస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వ్యక్తులు న్యుమోనియా, బ్రాంకిటిస్, సీజర్స్ (మూర్ఛలు) వంటి వాటితో ఇబ్బంది పడవచ్చు. కొన్ని కేసులలో హెచ్3ఎన్2 ప్రాణాంతకంగా కూడా మారుతుంది. ఐసీఎంఆర్ డాటా వెల్లడించే దాని ప్రకారం, గత మూడు నెలల కాలంలో 10%కు పైగా ఎస్ఏఆర్ఐ రోగులు హాస్పిటల్ పాలయ్యారు. హెచ్3ఎన్2 రోగులకు ఆక్సిజన్ అవసరం పడుతుండటంతో పాటుగా 7%మంది రోగులకు ఐసీయు కేర్ కూడా కావాల్సి వస్తుంది.
ఇన్‌ఫ్లూయెంజా ఏ వైరస్‌కు ఉప రకం హెచ్3ఎన్2. ప్రతి సంవత్సరం సీజన్ మార్పుల సమయంలో ఇది వస్తుంది. వాతావరణంలో ఉష్ణోగ్రతల మార్పులు జరిగినప్పుడల్లా ఫ్లూ కేసులు పెరుగుతుండటంతో పాటుగా వేగంగా విస్తరిస్తుంటాయి. ప్రతి సంవత్సరం కొన్ని రకాల ఉత్పత్తివర్తనాలు ఇతర వాటికంటే వేగంగా విస్తరిస్తుంటాయి. హెచ్3ఎన్2 సహా అన్ని రకాల ఫ్లూ వైరస్‌లూ , ఈ వైరస్ బారిన పడిన వ్యక్తులు దగ్గినా, తుమ్మినా లేదా మాట్లాడినా ఇతరులకు వ్యాప్తి చెందుతుంటాయి. ఇవి ఈ వైరస్ బారిన పడని వ్యక్తులు ఈ వైరస్ ఉన్న ఏదైనా వస్తువును తాకినా లేదంటే ఉపరితలాలను ముట్టుకుని తమ నోరు లేదా ముక్కు తాకితే వారు కూడా ఈ అంటువ్యాధి బారిన పడే అవకాశాలున్నాయి.
హెచ్3ఎన్2 మరియు ఇతర ఫ్లూ వైరస్ల బారిన పడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్న వ్యక్తులలో ఐదు సంవత్సరాల లోపు వయసు పిల్లలు ముందుంటారు. వీరితో పాటుగా వయసు మీద పడిన పెద్దలు, గర్భవతులు, అలాగే మధుమేహం, అస్తమా, మూత్రపిండాల వ్యాధులు, గుండె వ్యాధులు వంటి దీర్ఘకాలిక లక్షణాలున్న వ్యక్తులు కూడా ఈ వైరస్ల బారిన పడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఈ ఫ్లూ ఇన్ఫెక్షన్స్ ప్రధాన లక్షణాలలో జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం , ముక్కు దిబ్బడ మరియు తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటివి ఉంటాయి. హెచ్3ఎన్2 ఇన్ఫెక్షన్లో సాధారణంగా జ్వరం మూడు రోజుల పాటు ఉంటుంది కానీ దగ్గు మాత్రం మూడు వారాల పాటు ఉంటుంది. డాక్టర్ సీహెచ్ లక్ష్మణ్ కుమార్, పీడియాట్రిషియన్, నిఖిల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మాట్లాడుతూ‘‘ ఐదేళ్ల లోపు పిల్లలు ఫ్లూ ఇన్ఫెక్షన్ వల్ల త్వరగా ప్రభావితం అవుతారు. ఈ సంవత్సరం, హెచ్3ఎన్2 ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. ఈ ఫ్లూ నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన పద్ధతి వారికి 4 ఇన్ 1 ఫ్లూ వ్యాక్సినేషన్ ఇవ్వడమే ! ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ప్రతి సంవత్సర వేయతగిన సూచనీయ ఫ్లూ వ్యాక్సినేషన్’’ అని అన్నారు.
‘‘గత మూడు నెలలుగా ఫ్లూ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిలో అత్యధిక శాతం కేసులు హెచ్3ఎన్2 వైరస్ కారణంగా కనిపిస్తున్నాయి. ఈ వైరస్ హాస్పిటల్లో చేరికలు పెరిగేందుకు సైతం కారణమవుతుంది. మరీ ముఖ్యంగా 65 సంవత్సరాలు మరియు ఆ పైన వయసు కలిగిన వ్యక్తులతో పాటుగా గర్భవతులు, గుండె సంబంధిత వ్యాధులు కలిగిన వ్యక్తులు, మధుమేహం లేదా అస్తమా ఉన్న వారు ఎక్కువ ప్రమాదానికి గురవుతున్నారు. 4 ఇన్ 1 ఫ్లూ వ్యాక్సినేషన్ కోసం మీ డాక్టర్‌ను సంప్రదించండి. ఈ వ్యాక్సినేషన్ తో హెచ్3ఎన్2 ఫ్లూ ఉపరకాలు సహా ఫ్లూ నుంచి కాపాడుతుంది’’ అని సూర్య చెస్ట్ క్లీనిక్, చెస్ట్ ఫిజీషియన్ డాక్టర్ ఏ వినయ్ కుమార్ అన్నారు.
పలు ఆరోగ్య సంస్థలు, సీజనల్ ఫ్లూ వ్యాక్సినేషన్‌ను హై రిస్క్ గ్రూప్‌లు అయినటువంటి హెల్త్‌కేర్ వర్కర్లు, గర్భవతులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరియు 65 సంవత్సరాల వయసు దాటిన వ్యక్తులు, ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగిన పిల్లలు తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నాయి. హెచ్3ఎన్2 ఫ్లూ ను నివారించడంతో పాటుగా దాని వ్యాప్తిని అడ్డుకోవడానికి తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం, గుంపులుగా ఉన్నచోట మాస్కు ధరించడం, ఈ వైరస్ బారిన పడిన వ్యక్తులకు దూరంగా ఉండటం సూచించడం జరిగింది.