Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : భారత్‌లో ఆపిల్ తొలి రిటైల్ స్టోర్ ప్రారంభమైంది. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లేక్స్‌లో ఏర్పాటు చేసిన 'ఆపిల్ బికెసి'ని మంగళవారం ఆ కంపెనీ సిఇఒ టిమ్ కుక్ వేడుకగా ప్రారంభిం చారు. ఆయనే స్వయంగా ద్వారాలు తెరిచి.. వినియోగదారులను లోపలికి అహ్వానించారు. ఈ స్టోర్‌ను 20,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. రెండో స్టోర్‌ను ఢిల్లీలో తెరువనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థకు 500 రిటైల్ స్టోర్లు ఉన్నాయి. భారత్‌లోని విస్తృతావకాశాలపై ఆపిల్ దృష్టి సారించింది.