Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్ : 50 రూపాయల నుండి ప్రారంభమయ్యే క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందుకునేందుకు వినియోగదారులు 1 గ్రాము లేదా అంతకన్నా ఎక్కువ పరిమాణంతో 24 K బంగారం కొని, UPI ద్వారా పే చేయవచ్చు. 1 కోటికి పైగా కస్టమర్లు డిజిటల్ గోల్డ్ పెట్టుబడులకు ఫోన్ పే ను విశ్వసిస్తున్నారు. జాతీయం, 2023: అక్షయ తృతీయ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని భారతదేశపు అగ్రగామి డిజిటల్ పేమెంట్ల వేదిక ఫోన్ పే ఒక ఉత్సాహపూరిత ఆఫర్ ను ప్రకటించింది. 22 ఏప్రిల్ 2023న యాప్ ద్వారా కొనుగోలు చేసిన డిజిటల్ బంగారంపై తప్పనిసరి క్యాష్ బ్యాక్ ను ఫోన్ పే అందిస్తుంది. యాప్ ద్వారా ఉచితంగా నిల్వ చేసుకునే సౌలభ్యం, తయారీ ఖర్చులు లేకుండా కస్టమర్లు అత్యంత నాణ్యమైన 24K బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు చేసిన బంగారాన్ని కస్టమర్ తరపున భాగస్వామి ద్వారా బ్యాంక్ గ్రేడ్ లాకర్లలో నిల్వ చేయబడుతాయి. 22 ఏప్రిల్ న 1 గ్రామ్ లేదా అంతకన్నా ఎక్కువ పరిమాణంలో బంగారం కొనుగోలు జరిపితే, 50 నుండి 500 రూపాయల వరకు తప్పనిసరి క్యాష్ బ్యాక్ పొందడానికి అర్హులు కాగలరు.
డిజిటల్ గోల్డ్ రంగంలో రెండు అగ్రగామి, విశ్వసనీయమైన సంస్థలైన MMTC PAMP & SafeGold నుండి అత్యంత స్వచ్చమైన బంగారాన్ని అందించే ఏకైన డిజిటల్ పేమెంట్ యాప్ గా PhonePe నిలుస్తోంది.
PhonePe యాప్ లో బంగారం కొనడం వల్ల కలిగే ప్రయోజనాలు కింద ఇవ్వబడ్డాయి:
స్వచ్ఛతకు గొప్ప భరోసా: PhonePeలో, భాగస్వాములు ఆఫర్ చేస్తున్నట్టుగా 99.99% స్వచ్ఛమైనదిగా ధృవీకరించిన 24K డిజిటల్ గోల్డ్ ను కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు.
సౌలభ్యం: కస్టమర్లు తమ ఇంటి నుండే 24*7లో ఎప్పుడైనా సౌకర్యవంతంగా డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయడాన్ని ఎంచుకోవచ్చు. తాము నిల్వ చేసిన బంగారాన్ని ఏ సమయంలో విక్రయించినా, 48 గంటల్లో దానికి సంబంధించిన డబ్బు వారి బ్యాంక్ ఖాతాలకు జమ అవుతుంది.
ఇన్సూర్ చేసిన బ్యాంక్ గ్రేడ్ లాకర్లలో నిల్వ: డిజిటల్ మార్గంలో కొనుగోలు చేసిన 24Kగా ధృవీకరించిన బంగారానికి తయారీ ఛార్జీలు ఉండవు. బ్యాంక్ గ్రేడ్ గోల్డ్ లాకర్లలో ఉచితంగా నిల్వ చేసుకోవచ్చు.
ఎంత మొత్తంతో అయినా పెట్టుబడి: కస్టమర్లు తమకు నచ్చినట్టుగా ఎంత మొత్తంతో అయినా డిజిటల్ గోల్డ్ లో పెట్టుబడి పెట్టే సౌలభ్యాన్ని కలిగి ఉంటారు.
వన్ టైమ్ కొనుగోలు చేయించడంపై మాత్రమే కాకుండా, SIP ద్వారా కూడా డిజిటల్ మార్గాన బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు PhonePe ప్రతి భారతీయుడిని ప్రోత్సహిస్తూ, కస్టమర్లు క్రమపద్ధతిలో దీర్ఘకాలికానికి పెట్టుబడి పెట్టడంలోనూ సహాయపడుతోంది.
భారతదేశంలో 19,000కుపైగా పిన్ కోడ్లకు చెందిన 1 కోటికి పైగా కస్టమర్లు ఇప్పటికే పారదర్శకమైన ధరల్లో అత్యంత స్వచ్ఛత కలిగిన 24 K బంగారాన్ని కొన్నారు. PhonePeలో బంగారం కొని, ఉత్సాహపూరితమైన క్యాష్ బ్యాక్ అందుకునే పద్ధతి కింద ఇవ్వబడింది. :
1 వ దశ: మీ PhonePe యాప్ హోమ్ పేజీలో కింది పట్టీపై ఉన్న ‘Wealth/సంపద’ను ట్యాప్ చేయండి.
2వ దశ: సంపద స్క్రీన్ లోని బంగారంను ఎంచుకోండి.
3వ దశ: "Buy One Time/వన్ టైమ్ కొనండి”ని ఎంచుకోండి.
4వ దశ: “గ్రాముల్లో కొనండి”ని ఎంచుకుని, 24K బంగారం కనీసం 1 గ్రామును చేర్చడం ద్వారా ద్వారా ముందుకెళ్లండి.
5వ దశ: మీ బంగారం కొనుగోలు తుది వివరాలను చెక్ చేసి, UPI ద్వారా ‘Proceed to Pay/పే చేసేందుకు ముందుకెళ్లు’పై క్లిక్ చేయండి. అంతే, అంతా పూర్తయినట్టే!
కాసేపట్లే మీకు PhonePe యాప్ లో అప్ డేట్ చేసిన బంగారం బ్యాలెన్స్ కనిపిస్తుంది. కొనుగోలు విజయవంతమైన తర్వాత, మీరు మీ PhonePe గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ లో క్యాష్ బ్యాక్** అందుకుంటారు.
PhonePe పరిచయం:
డిసెంబర్ 2015లో స్థాపించబడిన PhonePe అటు వినియోగదారులు, ఇటు మర్చంట్లకు డిజిటల్ సౌకర్యాలను అందిస్తూ, భారతదేశపు అతిపెద్ద పేమెంట్ల యాప్‌గా అవతరించింది. 45 కోట్ల (450 మిలియన్ల) మందికి పైగా రిజిస్టర్ చేసుకున్న యూజర్లతో, ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు ఇప్పుడు PhonePe వాడుతున్నారు. అలాగే దేశంలోని 99% పిన్కోడ్లను కవర్ చేస్తూ, 2,3,4 శ్రేణి పట్టణాలను ప్రాంతాలను దాటుకొని 3.5 కోట్ల (35 మిలియన్ల) మంది ఆఫ్‌లైన్ మర్చంట్లను కంపెనీ విజయవంతంగా డిజిటలీకరణ చేసింది. భారత్ బిల్ పే సిస్టం (BBPS)లోనూ అగ్రస్థానంలో నిలిచిన PhonePe ఈ BBPS వేదికలో జరిగే లావాదేవీల్లో 45% పైగా లావాదేవీలను ప్రాసెస్ చేసింది. 2017లో ఆర్థిక సేవల రంగంలో PhonePe అడుగుపెట్టి, తన వేదికలో సురక్షితమైన, సౌకర్యవంతమైన పెట్టుబడి ఆప్షన్లను యూజర్లకు అందిస్తోంది. అప్పటినుండి ప్రతి భారతీయుడు డబ్బు ప్రవాహాన్ని తెలుసుకుని, సేవలకు యాక్సెస్ పొందడానికి సమాన అవకాశం కల్పించేలా వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్ మరియు ఇన్సూరెన్స్ ఉత్పత్తులను PhonePe పరిచయం చేసింది. ఇటీవల ట్రస్ట్ రీసెర్చీ అడ్వైజరీ (TRA) నిర్వహించిన బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్ 2022 ప్రకారం డిజిటల్ పేమెంట్లకు అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌గా కూడా PhonePe గుర్తింపు దక్కించుకుంది.
- స్వచ్ఛత హామీ పూర్తిగా బంగారం భాగస్వాములు ఇచ్చేది
- మొదటి 5 సంవత్సరాలకు స్టోరేజ్ పూర్తిగా ఉచితం
పేమెంట్ల సౌలభ్యం/ప్రాసెసింగ్ కు మాత్రమే PhonePe యొక్క పాత్ర పరిమితం. ఆర్డర్ నిర్వహణ/ఫుల్ ఫిల్ మెంట్ కార్యకలాపాలను PhonePe యొక్క భాగస్వాములు చేపడుతారు. కొనుగోలు చేసే ముందు దయచేసి, ఆఫర్ యొక్క నియమ, నిబంధనలను చదవండి. నియమ, నిబంధనలు వర్తిస్తాయి.