Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం ఆపిల్ భారత్‌లో తన రెండో స్టోర్‌ను ఢిల్లీలో ఏర్పాటు చేసింది. దీన్ని గురువారం ఆ కంపెనీ సిఇఒ టిమ్ కుక్ లాంఛనంగా ప్రారంభించారు. భారీ ఎత్తున వినియోగదారులు స్టోర్‌ను సందర్శించడానికి వచ్చారు. ఈ సందర్భంగా టిమ్‌కుక్ వినియోగదారులకు స్వాగతం పలికారు. టివ్ కుక్ బుధవారం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. అంతక్రితం రోజు ముంబయి స్టోర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న విషయం తెలిసిందే. భారత మార్కెట్‌పై ఆపిల్ కీలక దృష్టి సారించిన నేపథ్యంలో ఇక్కడ రిటైల్ స్టోర్ల ఏర్పాటును వేగవంతం చేసింది.