Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రపంచంలోనే తొలిసారి బిఎల్డిసి టెక్నాలజీ ద్వారా నడిచే అత్యంత శక్తివంతమైన ఎయిర్ కూలర్ల శ్రేణీని ఆవిష్కరించినట్లు ఎయిర్ కూలర్లలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న సింఫనీ లిమిటెడ్ తెలిపింది. ఇతర కూలర్లతో పోలిస్తే ఇవి 60 శాతం తక్కువ విద్యుత్తును వినియోగిస్తాయని ఆ సంస్థ పేర్కొంది. ఈ శ్రేణీలో 80 లీటర్లు, 55 లీటర్లు, 30 లీటర్ల వాటర్ ట్యాంక్ సామర్థ్యంతో 3 మోడళ్లను విడుదల చేసినట్లు తెలిపింది. 7 స్పీడ్ ఆప్షన్లు, 8 గంటల వరకు నైట్ స్లీప్ మోడ్, టచ్ స్క్రీన్ కంట్రోల్ ప్యానెల్, వాటర్ ట్యాంక్ ఖాళీ అయితే అలారం లాంటి అదనపు ఫీచర్లు వీటిలో ఉన్నాయని పేర్కొంది. ఎసిలతో పోలిస్తే ఇవి కేవలం 10 శాతం విద్యుత్తునే వాడుకుంటాయని సింఫనీ లిమిటెడ్ సిఎండి అచల్ బకేరీ తెలిపారు.