Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూర్యుని ఉపరితలంలో 20% మాదిరి ఉష్ణోగ్రతలు అవసరమవుతాయని మీకు తెలుసా?
- నేచురల్ డైమండ్ కౌన్సిల్ డైమండ్ పరిశ్రమ గురించిన అపోహలు, తప్పుడు భావనలను పరిష్కరిస్తూ విశ్లేషణను విడుదల చేయడం ద్వారా పారదర్శకతను ప్రోత్సహిస్తూనే ఉంది ~
నవతెలంగాణ - హైదరాబాద్
సహజ వజ్రాలపై అధికార వనరు అయిన నేచురల్ డైమండ్ కౌన్సిల్, డైమండ్ ఫ్యాక్ట్స్: పరిశ్రమ గురించిన అపోహలు, తప్పుడు భావనలు పేరిట తన 2023 విశ్లేషణాత్మక నివేదికను విడుద ల చేసింది. ఈ నివేదిక ద్వారా, నేచురల్ డైమండ్ కౌన్సిల్ సహజ వజ్రాలు,వాటి సింథటిక్ ప్రతిరూపా ల గురించి తప్పుడు సమాచారాన్ని పరిష్కరించడానికి నడుం బిగించింది. ‘‘వినియోగదారులు గతంలో కంటే ఎక్కువ పరిశోధనాత్మకంగా వ్యవహరిస్తూ, అవగాహన కలిగిన యుగంలో, వారు కంపెనీల నుండి విలువలు, బాధ్యతాయుతమైన వ్యాపార పద్ధతుల గురించి మరీ ముఖ్యంగా తాము కొ నుగోలు చేస్తున్న విస్తృత పరిశ్రమ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు’’ అని ఎన్డీసీ సీఈఓ డేవిడ్ కెల్లీ అ న్నారు. ‘‘నేచురల్ డైమండ్ కౌన్సిల్లో మేం సమాచారాన్ని పారదర్శకంగా అందించడం ద్వారా అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో వినియోగదారులకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం’’ అని ఆయన అ న్నారు.
వజ్రాల పరిశ్రమ గురించిన సాధారణ అపోహలను నివేదిక తొలగిస్తుంది. నివేదిక లో ఉన్న వాస్తవాలకు కొన్ని ఉదాహరణలు:
ముఖ్యాంశం: ప్రయోగశాలలో వృద్ధి చేసిన వజ్రాలేవో, సహజ వజ్రాలేవో కనుగొనవచ్చు.
సహాయక వాస్తవాలు:
- ప్రయోగశాలలో రూపొందించిన వజ్రాలను వృత్తిపరమైన ధ్రువీకరణ సాధనాలను ఉపయోగించి గుర్తించవచ్చు.
- భూమి ఉపరితలం క్రింద సహజ వజ్రం ఏర్పడటానికి బిలియన్ల సంవత్సరాల సమ యం పట్టే విధంగా కాకుండా, ప్రయోగశాలలో రూపుదిద్దుకున్న వజ్రాలు కేవలం కొ న్ని వారాల్లో భారీగా ఉత్పత్తి చేయబడి, నిర్దిష్ట వృద్ధి-సంబంధిత లక్షణాలు, ధోరణు లను ప్రదర్శిస్తాయి.
- ముఖ్యాంశం: ప్రయోగశాలలో పెరిగిన అన్ని వజ్రాలు సుస్థిరదాయకంగా ఉండవు.
సహాయక వాస్తవాలు:
- ప్రయోగశాలలో రూపుదిద్దుకున్న వజ్రాలు సహజ వజ్రాల సృష్టి ప్రక్రియను ప్రతిబింబిస్తాయి, దీనికి అధిక మొత్తంలో విద్యుత్తు అవసరం, ఎక్కువగా జాతీయ గ్రిడ్ నుండి.
- 60% పైగా ప్రయోగశాలలో రూపుదిద్దుకునే వజ్రాలు చైనా, భారతదేశంలో భారీగా ఉత్పత్తి చేయబడుతున్నాయి, ఇక్కడ వరుసగా 63% మరియు 74% గ్రిడ్ విద్యుత్ బొగ్గు నుండి వస్తుంది.
- ప్రయోగశాలలో రూపొందే వజ్రాల తయారీకి సూర్యుని ఉపరితలం ఉష్ణోగ్రతలో 20%కి సమా నమైన ఉష్ణోగ్రతలు అవసరం కావచ్చు.
- ముఖ్యాంశం: సహజ వజ్రాలు ఏర్పడే ప్రక్రియ అంటే అవి అంతర్లీనంగా అరుదుగా ఉంటాయి. అవి పరి మిత సహజ వనరు.
- సహాయక వాస్తవాలు:
- సహజ వజ్రాల నిర్మాణం మిలియన్ల, కొన్నిసార్లు బిలియన్ల సంవత్సరాలలో జరుగు తుంది. తీవ్రమైన ఉష్ణోగ్రతలు, పీడనాల వద్ద భూమి ఉపరితలంలో పరిమిత మండ లాల్లో సంభవిస్తుంది.
- గ్లోబల్ నేచురల్ డైమండ్ రికవరీ 2005లో గరిష్ట స్థాయికి చేరుకుంది, గత 16 ఏళ్లలో 30% పైగా తగ్గింది.
- 1 క్యారెట్ వజ్రాల వార్షిక రికవరీ అనేది పరిమాణంలో వ్యాయామ బంతికి సమానం.
- ముఖ్యాంశం: ప్రయోగశాలలో రూపుదిద్దుకున్న వజ్రాలు ఇటీవలి సంవత్సరాలలో గణనీయమైన ధర క్షీణతను ఎదుర్కొన్నాయి.
సహాయక వాస్తవాలు:
- లేబొరేటరీలో రూపుదిద్దుకున్న వజ్రం సగటు ధర 2016 నుండి 2023 వరకు 1.5 క్యారెట్ 74% పైగా తగ్గింది.
- సహజ వజ్రాల ధరలు కూడా హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పటికీ, గత 35 సంవ త్సరాలలో సగటున అవి సంవత్సరానికి 3% చొప్పున పెరిగాయి.
- ముఖ్యాంశం: సహజ వజ్రాల పరిశ్రమలో ఎథికల్ సోర్సింగ్ (నైతిక సేకరణ)కు ప్రాధాన్యత ఉంది.
సహాయక వాస్తవాలు:
- ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్థచే నిర్దేశించబడిన కింబర్లీ ప్రక్రియ ప్రకారం, ముడి వజ్రాల వ్యాపారం సంఘర్షణ-రహితంగా ఉండేలా కచ్చితంగా నియంత్రించబ డుతుంది.
- రెస్పాన్సిబుల్ జ్యువెలరీ కౌన్సిల్ (RJC) థర్డ్ పార్టీ ఆడిట్ చేయబడిన ధ్రువపత్రాల ద్వారా బాధ్యతాయుతమైన సోర్సింగ్‌కు హామీ ఇస్తుంది.
- బ్రాండ్లు, రిటైలర్లు, ఆభరణాల వ్యాపారులు నైతిక సోర్సింగ్ ప్రోటోకాల్‌లు, తమ సర ఫరా గొలుసులకు పారదర్శకతను తీసుకువచ్చే విధానాలను ఎక్కువగా అమలు చేస్తున్నారు.
ముఖ్యాంశం: సహజ వజ్రాలు న్యూయార్క్ నగరం, చికాగో, వాషింగ్టన్ D.C., లాస్ వెగాస్లతో సమాన మైన ప్రాంతంలో జీవవైవిధ్యాన్ని రక్షించడంలో సహాయపడతాయి. ప్రపంచవ్యాప్తంగా సహజ వజ్రాల పునరుద్ధరణ కోసం ఎన్డీసీ సభ్య కంపెనీలు ఉపయోగించే భూమికి ఇది దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ.
సహాయక వాస్తవాలు:
- ప్రముఖ డైమండ్ కంపెనీ డీ బీర్స్ గ్రూప్ అనేది కెల్ప్ బ్లూతో భాగస్వామ్యం కలిగి ఉం ది. కెల్ప్ కు గల కార్బన్‌ను నిల్వ చేయగల సామర్థ్యాన్ని అన్వేషిస్తుంది, అదే సమ యంలో సముద్ర స్థితిగతులను మెరుగుపరుస్తుంది.
- డైమండ్ రూట్ అనేది దక్షిణాఫ్రికా, బోట్స్వానాలోని క్లిష్టమైన వన్యప్రాణుల ఆవాసాల ను రక్షించడానికి డి బీర్స్ గ్రూప్ ద్వారా స్థాపించబడిన నెట్వర్క్.
ముఖ్యాంశం: సహజ వజ్రాలు అవి ఉద్భవించిన దేశాలకు ప్రయోజనం చేకూరుస్తాయి. సహజ వజ్రాల పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ల ప్రజల జీవనోపాధికి మద్దతు ఇస్తుంది.
సహాయక వాస్తవాలు:
- ముడివజ్రాల విలువలో 80% వరకు స్థానిక కొనుగోలు, ఉపాధి ప్రయోజనాలు, సా మాజిక కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలలో పెట్టుబడితో పాటు పరిశ్రమ నుండి సంబంధిత ప్రభుత్వాలకు చెల్లించే పన్నులు, రాయల్టీలు, డివిడెండ్ల రూపంలో స్థా నిక కమ్యూనిటీల వద్ద ఉంటుంది.
- ఎన్డీసీ సభ్యులకు సంబంధించి, మొత్తం సేకరణలో 85% స్థానికంగా ఉంటుంది.
- కెనడాలో, సహజ వజ్రాల పరిశ్రమ నార్త్ వెస్ట్ టెరిటరీలలో మొత్తం జీడీపీలో 24%కి దోహదపడుతుంది. బిలియన్లు వ్యాపారాలకు, .5 బిలియన్లు దేశీయ యాజ మాన్యంలోని (NWT) వ్యాపారాలకు అందించబడ్డాయి. ట్రేస్బిలిటీ, స్టాక్‌పైలింగ్, ఇతర అపోహలు వంటి అంశాలతో సహా వజ్రాల పరిశ్రమ గురించిన అదనపు వాస్తవాల కోసం సందర్శించండి: https://www.naturaldiamonds.com/in/diamond-facts-info/diamond-facts/ ఈ విశ్లేషణ ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా గౌరవనీయ థర్డ్ పార్టీ సంస్థలు నిర్వహించిన విస్తృత శ్రేణి ద్వితీయ పరిశోధనల సమగ్ర సమీక్ష నుండి తీసుకోబడ్డాయి. పరిశ్రమ నిపుణులు, స్వతంత్ర సుస్థిరత సలహాదారులను కూడా సంబంధిత అంశాలపై సంప్రదించారు.