Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో టాటా హిటాచీ యొక్క డీలర్షిప్, రామా ఎక్స్కవేటర్ సేల్స్, సర్వీస్, స్పేర్ పార్ట్స్ మరియు మెషీన్ కేర్ ఫెసిలిటీ (ఎంసీఎఫ్) కోసం తమ నూతన ఇంటిగ్రేటెడ్ సదుపాయాన్ని కరీంనగర్లో ప్రారంభించింది. టాటా హిటాచీ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ బీకెఆర్ ప్రసాద్ ఈ ఒన్ స్టాప్ సేల్స్, సర్వీస్, విడిభాగాల షాప్‌ను ప్రారంభించారు. టాటా హిటాచీ యొక్క కార్యకలాపాలను రాష్ట్రంలో మరింతగా విస్తరిచేందుకు ఇది సహాయపడనుంది.
‘‘టాటా హిటాచీ స్ధిరంగా వినియోగదారులకు మెరుగైన సేవలను సమయానికి అందించేలా వారికి దగ్గరగా ఉండేందుకు కార్యకలాపాలను విస్తరిస్తుంది. ఈ ఇంటిగ్రేటెడ్ సదుపాయం, మా వినియోగదారులకు అత్యున్నత శ్రేణి సేవలు, విడిభాగాలను అందించాలనే మా ప్రయత్నానికి కొనసాగింపు’’ అని బీకెఆర్ ప్రసాద్ అన్నారు. టాటా హిటాచీ అధీకృత డీలర్‌గా రామా ఎక్స్కవేటర్ 1999 నుంచి కార్యకలాపాలను కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, వరంగల్‌లో నిర్వహిస్తుంది. కరీంనగర్లో కేవలం 8 మెషీన్లతో ప్రారంభించి ఇప్పుడు దాదాపు 600 మెషీన్లు తిరుగుతున్నాయి. తద్వారా ఈ ప్రాంతంలో టాటా హిటాచీ మార్కెట్ లీడర్‌గా వెలుగొందుతుంది.
‘కరీంనగర్లో కేవలం 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో మేము కార్యకలాపాలు ప్రారంభించగా, నేడు ఈ సదుపాయాన్ని 20వేల చదరపు అడుగుల విస్తీర్ణానికి పెంచాము’’ అని రామా ఎక్సకవేటర్ మేనేజింగ్ డైరెక్టర్ భజరంగ్ బజాజ్ అన్నారు. ‘‘ఈ కేంద్రంలో ఎంసీఎఫ్, ఆఫీస్ ప్రాంగణం, స్టోరేజీ, మెషీన్ యార్డ్, గ్రీన్ స్పేస్, వంటివి టాటా హిటాచీ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి’’ అని అన్నారు
ఈ నూతనంగా ప్రారంభించిన కేంద్రంలో మెషీన్ల ఓవర్‌హాల్, వెల్డింగ్, ఇంజిన్ మరమ్మత్తులు, హైడ్రాలిక్ మరమ్మత్తులు కూడా చేస్తారు.
ప్రారంభోత్సవ ఆఫర్‌గా విడిభాగాలు, మరమ్మత్తుల సర్వీస్‌పై 15% రాయితీ అందిస్తారు. ‘‘ఈ సదుపాయం వినియోగదారుల నడుమ ఆదరణ పొందడంతో పాటుగా వారు ఖర్చు చేసిన నగదుకు మరింత విలువను అందిస్తుందని ఆశిస్తున్నాము’’ అని రామా ఎక్స్కవేటర్ భాగస్వామి, సంజయ్ బజాజ్ అన్నారు.