Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కండక్టర్లకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ హితవు
- రాష్ట్రవ్యాప్తంగా కండక్టర్లకు టాక్ట్ శిక్షణ ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రయాణికులతో మర్యాదగా మెలగాలని కండక్టర్లకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్ సూచించారు. సంస్థకు కండక్టర్లు, డ్రైవర్లే బ్రాండ్ అంబాసిడర్లని, క్షేత్రస్థాయిలో జాగ్రత్తగా విధులు నిర్వహించాలని హితవు పలికారు. చిన్న, చిన్న పొరపాట్లతో టీఎస్ఆర్టీసీ విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదముందని హెచ్చరించారు. టీఎస్ఆర్టీసీ బ్రాండ్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి.. సంస్థ అభివృద్ధికి పాటుపడాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న డిపోల్లో కండక్టర్లకు టీఎస్ఆర్టీసీ ఏప్రిల్ ఛాలెంజ్ ఫర్ ట్రైనింగ్(టాక్ట్) శుక్రవారం ప్రారంభమైంది. హైదరాబాద్ బస్ భవన్ నుంచి వర్చ్‌వల్‌గా ఈ శిక్షణ జరుగుతున్న తీరును సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ పరిశీలించారు. శిక్షణలో పాల్గొన్న కండక్టర్లతో ముచ్చటించారు. శిక్షణ జరుగుతున్న తీరు, శిక్షణలో చెబుతున్న విషయాల ఉపయోగం, తదితర అంశాలపై వారిని అడిగి తెలుసుకున్నారు. ''మనం ప్రయాణికుల కేంద్రంగానే పనిచేయాలి. ప్రయాణికులతో ఎట్టి పరిస్థితుల్లోనూ దురుసుగా ప్రవర్తించొద్దు. బస్సులోకి రాగానే వారిని నమస్తే అంటూ చిరునవ్వుతో పలకరించాలి. కొత్త ప్రయాణ ికులను మన సంస్థ వైపు మెగ్గుచూపేలా వ్యవహారించాలి. ప్రయాణికులకు ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయనే విషయాన్ని దష్టిలో పెట్టుకుని విధులు నిర్వహించాలి. విధి నిర్వహణలో స్వీయ క్రమశిక్షణను కలిగి ఉండాలి.'' అని కండక్టర్లకు సంస్థ ఎండీ సజ్జనర్ హితవు పలికారు.