Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రయివేటు రంగంలోని ఐసిఐసిఐ బ్యాంక్ 2023 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో 30 శాతం వృద్థితో రూ.9,121.87 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.7,018.71 కోట్ల లాభాలు నమోదు చేసింది. ప్రతీ ఈక్విటీ షేర్‌కు రూ.8 తుది డివిడెండ్‌ను ప్రకటించింది. 2022-23 మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం 32 శాతం పెరిగి 36,108.88 కోట్లకు చేరింది. మొత్తం డిపాజిట్లు 10.9 శాతం పెరిగి రూ.11,80,841 కోట్లకు చేరాయి. నికర నిరర్థక ఆస్తులు 0.48 శాతానికి తగ్గాయి. ఇంతక్రితం డిసెంబర్ త్రైమాసికంలో ఇవి 0.55 శాతంగా ఉన్నాయి.