Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యూ4 లాభాల్లో 45 శాతం పతనం
ముంబయి : యెస్ బ్యాంక్ లాభాలకు రాని బాకీలు గండికొట్టాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం (2022-23) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో యెస్ బ్యాంక్ నికర లాభాలు 45 శాతం పతనమై రూ.202 కోట్లకు పడిపోయాయి. 2022-23లో బ్యాంక్ స్థూల లాభాలు 32.7 శాతం తగ్గి రూ.717 కోట్లుగా నమోదయ్యాయి. గడిచిన క్యూ4లో బ్యాంక్ నికర వడ్డీపై ఆదాయం 15.4 శాతం పెరిగి రూ.2,105 కోట్లకు చేరింది. స్థూల డిపాజిట్లలో 10 శాతం వృద్థి చోటు చేసుకుంది. వడ్డీయేతర ఆదాయం 22.8 శాతం పెరిగి రూ.1,082 కోట్లుగా నమోదయ్యింది. క్రితం క్యూ4లో మొండి బాకీల కోసం చేసే కేటాయింపులు 127 శాతం పెరిగి రూ.618 కోట్లకు చేరాయి. దీంతో లాభాలు తగ్గాయి. 2023-24 రుణాల మంజూరులో 15-20 శాతం వృద్థి సాధించాలని లక్ష్యంగా పెట్టు కున్నామని యెస్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ తెలి పారు. 2022-23లో కొత్తగా 3,000 మంది ఉద్యోగులను తీసుకున్నట్లు తెలిపారు. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 27,517కు చేరిందన్నారు.