Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇనుప ఖనిజం ఉత్పత్తిలో 21 శాతం వృద్థి లక్ష్యం
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ముడి ఇనుప ఖనిజం ఉత్పత్తిలో 21 శాతం వృద్థితో 41.22 మిలియన్ టన్నుల సామర్థ్యానికి చేరాలని ఎన్ఎండీసీ లక్ష్యంగా పెట్టుకుంది. 2026-27లో ఏకంగా 60 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయాలని నిర్దేశించుకున్నట్టు ఆ సంస్థ ఉన్నతాధికారి వెల్లడించారు. గడిచిన మార్చి త్రైమాసికంలో ఎన్ఎండిసి 14.29 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించింది. అస్ట్రేలియాలో లిథియం రిజర్వులను వెలికితీ యాలని యోచిస్తున్నామని ఎన్ఎండీసీ డైరెక్టర్ (ప్రొడక్షన్) డికె మోహంతి వెల్లడించారు. అక్కడి ఒక గనిలో మెజారిటీ వాటాను పొందినట్లు వెల్లడిం చారు. ఉత్పత్తికి తుది దశలో ఉన్నామని.. మంచి ఫలితాలు రావొచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. లిథియం గని ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు.