Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రయివేటు రంగంలోని ఇండస్ఇండ్ బ్యాంక్ 2022-23 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 50 శాతం వృద్థితో రూ.2,040 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. ఇంతక్రితం ఆర్థిక సంవ తరం ఇదే క్యూ4లో రూ.1,361 కోట్ల లాభాలు నమోదు చేసింది. 2022-23కు గాను ప్రతీ రూ.10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్‌పై రూ.14 లేదా 140 శాతం డివిడెండ్‌ను ప్రకటించింది. దీనికి ఆ బ్యాంక్ ఆఫ్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. ఇంతక్రితం ఆర్థిక సంవత్సరంలో రూ.8.50 శాతం లేదా 85 శాతం బోనస్‌ను అందించింది. గడిచిన క్యూ4లో బ్యాంక్ నికర వడ్డీపై ఆదాయం 17 శాతం పెరిగి రూ.4,669 కోట్లుగా నమోదయ్యింది. ఇతర ఆదాయం 13 శాతం వృద్థితో రూ.2,154 కోట్లుగా చోటు చేసుకుంది.