Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రేట్ లెర్నింగ్ గ్లోబల్ అప్‌స్కిల్లింగ్ ట్రెండ్స్ రిపోర్ట్ 2023
- భారతదేశంలోని ప్రొఫెషనల్స్ లో 83% మంది 2023లో తమ నైపుణ్యాలను పెంచుకోవాలని అనుకుం టున్నారు, ఇలాంటి వారి శాతం అంతర్జాతీయంగా 74%గా ఉంది.
- స్థూల ఆర్థిక అనిశ్చితిలు కొనసాగుతున్నప్పటికీ 2023లో తాము తమ ఉద్యోగాలను నిలబెట్టుకోగల మని భారతదేశంలోని ప్రొఫెషనల్స్ లో 71% మంది భావిస్తున్నారు, ఇలాంటి వారి శాతం అంతర్జాతీ యంగా 59% గా ఉంది.
నవతెలంగాణ - హైదరాబాద్
అగ్రగామి ఎడ్ టెక్ ప్లాట్ ఫామ్ అయిన గ్రేట్ లెర్నింగ్, భారతీయ ఎడిషన్ ప్రచు రణ అనంతరం, తన ‘అప్ స్కిల్లింగ్ ట్రెండ్స్ రిపోర్ట్ 2023’ అంతర్జాతీయ ఎడిషన్ ను విడుదల చేసింది. తాజా ఎడిషన్ 2023లో, ప్రజల అప్ స్కిల్లింగ్ ఎంపికలను ప్రభావితం చేసే ప్రపంచవ్యాప్త ధోరణులను మరీ ము ఖ్యంగా నాలుగు కీలక మార్కెట్లయిన అమెరికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా, పశ్చిమాసియా లోని వా టిని (ఈ ప్రాంతాల్లో అప్ స్కిల్లింగ్ కోర్సులకు ఉన్న గరిష్ఠ డిమాండ్ ఆధారంగా) వెల్లడిస్తుంది. నైపుణ్యాలను పెంచుకోవడం వెనుక ఉద్దేశాలు, అప్ స్కిల్ అయ్యేందుకు ప్రజలకు ప్రేరణ కలిగించే అంశాలు, నైపుణ్యాలను పెంచుకోవడంలో ఎదురవుతున్న అడ్డంకులు, అప్ స్కిల్లింగ్ ను ప్రారంభించడంపై కార్యాలయాల ప్రభావం వం టి అంశాలపై ఈ నివేదిక వెలుగులు ప్రసరిస్తుంది. గ్రేట్ లెర్నింగ్ యొక్క అభ్యాసకుల ప్రవర్తనలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ నమూనా సమ్మేళనం ఆధారంగా ఈ ధోరణులు గుర్తించబడ్డాయి.
ప్రపంచవ్యాప్తంగా ఇతరులతో పోలిస్తే, భారతదేశంలో మరెంతో మంది ప్రొఫెషనల్స్ భవిష్యత్ సన్నద్ధక కెరీర్ల కోసం అప్ స్కిల్లింగ్ ను ఎంతో ముఖ్యమైం దిగా భావిస్తున్నారు. భారతదేశంలో 85% మంది ప్రొఫెషనల్స్ భవిష్యత్ సన్నద్ధక కెరీర్ల కోసం అప్ స్కిల్లింగ్ ఎంతో ముఖ్యమైందిగా భావిస్తున్నారు. అంతర్జాతీ యంగా చూస్తే, సగటున 76% ప్రొఫెషనల్స్ మాత్రమే అప్ స్కిల్లింగ్ ను ముఖ్యమైందిగా భావిస్తున్నారు. భవిష్యత్ సన్నద్ధక కెరీర్ల విషయానికి వస్తే, 84% మంది ఆగ్నేయా సియా ప్రొఫెషనల్స్, లాటిన్ అమెరికా నుంచి 76% మంది ప్రొఫెషన ల్స్ అప్ స్కిల్లింగ్ కు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికి విరుద్ధంగా, అమెరికా వంటి మరింతగా అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన ప్రొఫెషనల్స్ లో 64% మంది, పశ్చిమాసియా లో 66% మంది భవిష్యత్ సన్నద్ధక కెరీర్ల కోసం అప్ స్కిల్లింగ్ ను ముఖ్యమైందిగా భావిస్తున్నారు.
2023లో 83% మంది భారతీయ ప్రొఫెషనల్స్ అప్ స్కిల్ కావాలని భావిస్తుండగా, అంతర్జాతీయంగా ఇది 74%గా మాత్రమే ఉంది. ధోరణులను అనుసరించి చూస్తే, భారతదేశంలో 83% మంది ప్రొఫెషనల్స్ ఈ ఏడాది అప్ స్కిల్ కావాలని యోచిస్తున్నా రు. అదే సమయంలో పరిపక్వతగల మార్కెట్ అయినప్పటి కీ అమెరికాలో 47% మంది ప్రొఫెషనల్స్ మాత్రమే అప్ స్కి ల్ కావాలని భావిస్తున్నారు. పశ్చిమాసియా, ఆగ్నేయా సియా, లాటిన్ అమెరికా లాంటి ప్రాంతాల్లో 2023 లో అప్ స్కిల్ కావాలని భావిస్తున్న ప్రొఫెషనల్స్ శాతాలు వరుసగా 79%,77% మరియు 80% గా ఉన్నాయి. 71 % మంది భారతీయ ప్రొఫెషనల్స్ తమ ఉద్యోగాలను నిలబెట్టుకోగలమని ఆత్మవిశ్వాసంతో ఉండగా, అంతర్జాతీయంగా ఇది 59%గా ఉంది.
స్థూల ఆర్థిక పరిస్థితుల్లోని అనిశ్చితిల నేపథ్యంలో 2023లో తమ ఉద్యోగాలను నిలబెట్టుకునే విషయంలో భారతీయ సిబ్బంది, ప్రొఫెషనల్స్ కనబర్చిన ఆశావాదానికి పూర్తి భిన్నంగా అంతర్జాతీయ మార్కెట్లు ఈ విష యంలో తక్కువ విశ్వాసంతో ఉన్నాయి. భారతదేశంలో 71% మంది ప్రొఫెషనల్స్ తమ ఉద్యోగాలను నిలబెట్టుకునే విషయంలో ఆత్మవిశ్వాసంతో ఉండగా, అంతర్జాతీయంగా ఇది 59%గా ఉంది. ఈ ఏడాది తమ ఉద్యోగాలను నిలబెట్టుకునే విషయంలో అంతర్జా తీయంగా చూస్తే లాటిన్ అమెరికా అత్యంత తక్కువ శాతాన్ని (44%) కలిగి ఉంది. అమెరికాలో 59% మంది తమ ఉద్యోగాల ను నిలబెట్టుకునే విషయంలో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఈ శా తం ఆగ్నేయాసియాలో 60%గా, పశ్చిమాసియాలో 50%గా ఉంది.
అప్ స్కిల్ కావడంలో అదే సంస్థలో కెరీర్ వృద్ధి మరియు వ్యక్తిగత ఆసక్తులు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
అమెరికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా, భారతదేశం, పశ్చిమాసియాలలో అప్ స్కిల్ కావడంలో ప్రొఫెష నల్స్ కు ప్రేరణ కలిగించే అంశాల్లో అదే సంస్థలో కెరీర్ వృద్ధి అనేది ప్రధాన కారణంగా ఉంది. వ్యక్తిగత ఆస్తులు అనేది ఈ ప్రాంతాల్లోని ప్రొఫెషనల్స్ లో రెండో కారణంగా నిలిచింది. కొత్త ఉద్యోగాన్ని పొందడం అనేది తరువాతి స్థానంలో నిలిచింది. అప్ స్కిల్ అయ్యే విషయంలో కార్యాలయాల ప్రభావం ఎలా ఉందన్న ప్రశ్నకు, అప్ స్కిల్ కావాలన్న తమ నిర్ణయాన్ని కార్యాలయాలు ప్రభావితం చేస్తాయని అంతర్జాతీయంగా 59% మంది ప్రొఫెష నల్స్ భావించారు. అమెరికాలో 39% మంది ప్రొఫెషనల్స్ మాత్రమే కార్యాలయం తమ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. భారతదేశంలో ఇలా చెప్పిన వారు 67%గా ఉన్నారు. ఆగ్నేయాసిలో వీరు 60%గా, లా టిన్ అమెరికాలో 57%గా, పశ్చిమాసియాలో 57%గా ఉన్నారు.
భారతదేశం, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికాలలో ఆఫీస్ వర్క్ అనేది ప్రొఫెషనల్స్ ను అప్ స్కిల్ కాకుండా ఉంచుతుండగా, అమెరికా, పశ్చిమాసియాలలో కుటుంబ బాధ్యతలు అనేవి ప్రొఫెషనల్స్ అప్ స్కిల్ కావడంలో ప్రధాన అడ్డంకిగా ఉన్నాయి.
అప్ స్కిల్ కావడంలో అమెరికా విషయానికి వస్తే, ‘కుటుంబంతో బిజీగా ఉండడం’, ‘అందుబాటు’ అనే అంశా లను తాము ఎదుర్కొంటున్న సవాళ్లుగా ప్రొఫెషనల్స్ చెబుతున్నారు. ఆగ్నేయాసియాలో ‘అందుబాటు’ మరి యు ‘ఆఫీస్ పనితో బిజీగా ఉండడం’ అనే అంశాలు ప్రొఫెషనల్స్ కు ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయి. పశ్చిమా సియాలోని ప్రొఫెషనల్స్ తమ కుటుంబ బాధ్యతలను అప్ స్కిల్ కావడానికి ప్రధాన అవరోధంగా భావిస్తు న్నారు. లాటిన్ అమెరికాలో ఎంతో మంది ప్రొఫెషనల్స్ ‘ఆఫీస్ వర్క్ తో బిజీగా ఉండడం’ ను అప్ స్కిల్ కావ డంలో ప్రధాన సమస్యగా భావిస్తున్నారు. ఆగ్నేయాసియా విషయానికి వస్తే అక్కడి మహిళలు అప్ స్కిల్ అ య్యేందుకు ‘అందుబాటు’ మరియు ‘ఆఫీస్ వర్క్’ అనేవి ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయి. ఇతర ప్రాంతాల విష యానికి వస్తే కుటుంబ బాధ్యతలు, ఇంటిపనులు లాంటివి మహిళలను అప్ స్కిల్ కావడానికి దూరంగా ఉం చుతున్నాయి
ఈ సందర్భంగా ఈ నివేదిక గురించి గ్రేట్ లెర్నింగ్ సహ వ్యవస్థాపకులు అర్జున్ నాయర్ మాట్లాడుతూ, ‘‘ప్రస్తుత ఆర్థిక వాతావరణం, సంప్రదాయ ఉద్యోగాలు కొత్తవాటితో భర్తీ కావడం, అధునాతన ఉద్యోగాలు లాంటివి ప్రొఫెష నల్స్ లో వారు అత్యధిక స్థాయిలో పోటీపడాలని భావించేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్ స్కిల్లింగ్ ఉద్దే శాలు, అప్ స్కిల్ కావడానికి ప్రేరణ, ప్రస్తుతం డిమాండ్ లో ఉన్న నైపుణ్యాలు లాంటి మరెన్నో అంశాల గురిం చి ది గ్లోబల్ అప్ స్కిల్లింగ్ ట్రెండ్స్ 2023 నివేదిక సరికొత్త వెలుగులను ప్రసరింపచేస్తుంది. అంతర్జాతీయంగా చూస్తే 74% మంది ప్రొఫెషనల్స్ అప్ స్కిల్ కావాలని భావించడాన్ని చూస్తే, ఈ డిమాండ్ ఇప్పటికే బలంగా ఉందని, అది మరింత పెరుగుతోందని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.
గ్రేట్ లెర్నింగ్ గురించి:
గ్రేట్ లెర్నింగ్ అనేది బైజూస్ గ్రూప్ లో భాగం. ప్రొఫెషనల్ ట్రైనింగ్, హయ్యర్ ఎడ్యుకేషన్ కు సంబంధించి అగ్ర గామి ఎడ్ టెక్ కంపెనీ. ఇది సమగ్ర, పరిశ్రమ సంబంధిత హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ లను డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే వివిధ బిజినెస్, టెక్నాలజీ, ఇంటర్ డిసిప్లినరీ రంగాల్లో అందిస్తుంది. గ్రేట్ లె ర్నింగ్ ప్రోగ్రామ్స్ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్టాన్ ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఎంఐటీ ప్రొఫెష నల్ ఎ డ్యుకేషన్, ది యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ (ఆస్టిన్), నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, వార్టన్ ఆన్ లైన్, ది యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా, డియాకిన్ యూనివర్సిటీ, ఐయూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అప్లయిడ్ సైన్సెస్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ రూర్కీ, ఐఐఐటి – దిల్లీ, గ్రేట్ లేక్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ వంటి వాటితో కలసి రూపొందించబడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా 170 కి పైగా దేశాలలో 7.4 మిలియన్లకు పైగా అభ్యాసకులకు తిరుగులేని అభ్యసన అనుభూతిని అందించేందుకు గాను 5,900 మందికి పైగా పరిశ్రమ మెంటార్స్ తో కూడిన తన నెట్ వర్క్ తో పాటుగా బాగా చక్కటి అర్హతలు కలిగిన ఈ యూనివర్సిటీలలోని ప్రపంచ స్థాయి ఫ్యాకల్టీ సేవలను కూడా గ్రేట్ లెర్నింగ్ వినియోగించగలుగుతోంది.