Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : పలు నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను నాలుగు సహకార బ్యాంకులకు ఆర్బిఐ షాక్ ఇచ్చింది. ఈ జాబితాలోని తమిళనాడు స్టేట్ అపెక్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్, బాంబే మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్, జనతా సహకరి బ్యాంక్, బరన్ నాగ్రిక్ సహకరి బ్యాంక్‌లపై కొరడా ఝులిపించింది. ఆయా బ్యాంకులకు రూ.44 లక్షల భారీ జరిమానా విధించింది. తమిళనాడు స్టేట్ అపెక్స్ కో-ఆపరేటివ్ బ్యాంకుకు గరిష్టంగా రూ.16 లక్షలు, బాంబే మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు రూ.13 లక్షలు, జనతా సహకరి బ్యాంక్‌కు రూ.13 లక్షలు, బరన్ నాగ్రిక్ బ్యాంకుకు రూ.2 లక్షల చొప్పున ఆర్బిఐ జరిమానా వేసింది.