Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యామ్నాయాలపై చైనా దృష్టి
- ఎల్ఎన్జి కోసం యుఎఇతో జట్టు
షాంగై : ప్రపంచ వ్యాప్తంగా డాలర్ వాడకంలో తగ్గుదల చోటు చేసుకుంటుంది. వాణిజ్యంలో అమెరి కన్ డాలర్ కాకుండా ఇతర అనుకూల మైన కరెన్సీల వినియోగంపై అనేక దేశాలు దృష్టి పెడు తున్నాయి. చైనా, ఇతర దేశాలు సరిహద్దు వాణిజ్యం కోసం స్థానిక కరెన్సీ లను ఉపయో గించడం ద్వారా డాలర్‌పై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గిస్తు న్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మల్టీపోలార్ అంతర్జాతీయ కరెన్సీ వ్యవస్థను రూపొందించడంపై దృష్టి పెడుతున్నాయని భావిస్తున్నారు. ఈ ఏడాది మార్చి చివరలో షాంఘై పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ ఎక్సేంజ్ చైనా యువాన్‌ను ఉపయోగించి యునైటెడ్ అరబ్ ఎమి రేట్స్ నుండి సహజ వాయువును దిగుమతి చేసుకుంది. లిక్విఫైడ్ న్యాచు రల్ గ్యాస్ (ఎల్ఎన్జి) రెండో అతిపెద్ద దిగుమతిదారుగా ఉన్న చైనా తొలి సారి తన సొంత కరెన్సీ ని దీనికి వాడటం విశేషం. ప్రపంచ వస్తువుల వాణిజ్యం లో చాలా కాలంగా డాలర్ ఆధిపత్యం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. చమురు ఎగుమతి చేసే దేశాలు అంతర్జాతీయ స్థాయిలో డాలర్ కంటే యువాన్ వంటి కరెన్సీలను ఉపయోగించేందుకు ఆసక్తి చూపుతున్నాయని యుఎఇ ఎల్ఎన్జి ఒప్పందంతో తేలిందని స్విట్జర్లాండ్‌లోని ఫ్రిబోర్గ్ విశ్వవిద్యాలయంలోని స్థూల ఆర్థిక, ద్రవ్య ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ సెర్గియో రోస్సీ పేర్కొన్నారు.