Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆర్థిక సంవత్సరం 22-23లో అత్యధిక మార్కెట్ వాటా 7.4% నమోదు చేసిన తరువాత, భారతదేశపు ప్రీమియం మరియు అతి వేగంగా పెరుగుతున్న కారు తయారీదారు, కియా ఇండియా నేటికి 95 దేశాలకు 2 లక్షల ఎగుమతుల మైలురాయిని దాటిని గణనీయమైన చర్యను సాధించిందిని సంస్థ ఈ రోజు ప్రకటించింది. దీనితో, కంపెనీ రిక్రియేషన్ వెహికిల్స్ (ఎస్ యూవీ & ఎంపీవీ కలిపిన) ఎగుమతులలో దేశంలో తమ కార్యకలాపాలను ఆరంభించిన 4 ఏళ్ల లోపు వరుసగా మూడవ సంవత్సరం కోసం అవివాదాస్పదమైన నాయకునిగా కూడా మారింది. సెల్టోస్ కియా వారి ఎగుమతుల నంబర్స్ కి ప్రధానమైన భాగస్వామిగా ఉంది, 95 దేశాలకు 1,35,885 యూనిట్స్ పంపిణీతో, తన మార్కెట్ నాయకత్వాన్ని మరియు భారతదేశం ఆవల తన ప్రాచుర్యాన్ని పునరుద్ఘాటిస్తోంది. ముఖ్యంగా, కేఐఎన్ మొత్తం సేల్స్ లో సెల్టోస్ కు గణనీయమైన విజయ గాథ ఉంది, మొత్తం ఎగుమతులకు 68% మరియు దేశీయ సేల్స్ కు 53% అందచేసింది. కియా సోనెట్ మరియు కియా కారెన్స్ వరుసగా 54,406 యూనిట్స్, 8,230 యూనిట్స్ తో అనుసరించాయి. గత ఏడాది ఇదే సమయంలో పోల్చినప్పుడు కంపెనీ ప్రభావితపరిచే 22% క్వార్టర్-ఆన్-క్వార్టర్ ఎగుమతి వృద్ధిని నివేదించింది, ఆర్థిక సంవత్సరం 2022-23ను 44% సేల్స్ వృద్ధితో ముగించింది. భారతదేశం, విదేశాల్లో రెండిటిలో ఆటోమోటివ్ పరిశ్రమలో అంతర్జాతీయ నాయకునిగా తన స్థానాన్ని సురక్షితం చేసుకోవడంలో కియా వారి నవ్యత మరియు శ్రేష్టతలు కూడా తోడ్పడ్డాయి. మైయంగ్-సిక్ సోహ్న్, ఛీఫ్ సేల్స్ & బిజినెస్ అధికారి, కియా ఇండియా ఇలా అన్నారు, "మా ఆధునిక అనంతపురంగ సదుపాయం యొక్క తయారీ గొప్పదనాన్ని తయారీ, నవ్యత, భారతదేశంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మరియు ప్రభుత్వం కలకు తోడ్పడటం ద్వారా ప్రపంచానికి చూపించడానికి గర్విస్తున్నాం. ఇది భారతదేశం తయారీ వేదికగా, అంతర్జాతీయంగా ఎస్ యూవీలకు గల పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడానికి ఏ విధంగా సిద్ధంగా ఉందో కూడా చూపిస్తుంది. కియా సెల్టోస్ బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ నవ్యతగా ఎల్లప్పుడూ నిలిచింది మరియు తమ 4వ సంవత్సరంలో కూడా గెలుపు ప్రతిష్టను నిర్వహించడాన్ని కొనసాగిస్తోంది. భారతదేశం, అంతర్జాతీయ మార్కెట్లలో మా ఉత్పత్తులను ప్రేమించిన కస్టమర్స్ కు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ మైలురాయి నవీకరించడానికి మమ్మల్ని మరింత ప్రేరేపిస్తుంది మరియు మేము చేసే ప్రతి పనిలో మా కస్టమర్స్ ను ఉంచుతూనే ఆటోమోటివ్ పరిశ్రమలో పోకడలకు దారితీస్తుంది."
మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, సెంట్రల్ & దక్షిణ అమెరికా, మెక్సికో మరియు ఆసియా పసిఫిక్ ప్రాంతం వంటి విదేశీ మార్కెట్లలో సెల్టోస్, సోనెట్ మరియు కారెన్స్ కోసం కియా ఇండియా అధికంగా డిమాండ్ ను పొందుతోంది. 2022 డిసెంబర్ లో, కంపెనీ అత్యధికంగా ఇంతకు ముందు లేని విధంగా నెలవారీ ఎగుమతులను 9462 యూనిట్స్ ను పంపిణీ చేస్తూ రికార్డ్ నమోదు చేసింది.
కియా-ఇండియా గురించి
అనంతపురం జిల్లాలో తయారీ సదుపాయం నిర్మించడానికి 2017 ఏప్రిల్ లో, కియా ఇండియా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) పై సంతకం చేసింది. 2019 ఆగస్ట్ లో కియా పెద్ద మొత్తంలో ఉత్పత్తి ఆరంభించింది మరియు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం సుమారు 300,000 యూనిట్లు సాధించింది. 2021 ఏప్రిల్ లో, కియా ఇండియా ఆధునిక ప్రోడక్ట్స్ మరియు సేవల మద్దతు ద్వారా కస్టమర్స్ కు అర్థవంతమైన అనుభవాలను అందచేసే లక్ష్యంతో తమ కొత్త బ్రాండ్ గుర్తింపు, ప్రేరేపించే సంచారానికి అనుగుణంగా తనను పునః చిత్రీకరించుకుంది. కొత్త బ్రాండ్ గుర్తింపు క్రింద, కియా కొత్త ప్రమాణాలు సాధించడానికి మార్గాలను కనుగొనడానికి మరియు విజయాలు సాధించడానికి వినియోగదారులను ప్రేరేపించడానికి సిద్ధమైంది. ఇప్పటి వరకు, కియా ఇండియా భారతదేశపు మార్కెట్ కోసం 5 వాహనాలను విడుదల చేసింది- ద సెల్టోస్, ద కార్నివాల్, ద సోనెట్, ద కారెన్స్, మరియు ఈవీ6. కియా ఇండియా అనంతపురం ప్లాంట్ నుండి 8.89 లక్షలకు పైగా పంపిణీ చేసింది, వీటిలో 6.93 లక్షల దేశీయ సేల్స్ మరియు 1.96 లక్షలకి పైగా ఎగుమతులు ఉన్నాయి. భారతదేశపు రోడ్లు పై 3 లక్షలకు పైగా కనక్టెడ్ కార్స్ తో, దేశంలో ఇది కనక్ట్ చేయబడిన కారు నాయకులలో ఒకటిగా ఉంది. 213 పట్టణాలలో బ్రాండ్ కు విస్త్రతమైన 425 టచ్ పాయింట్స్ నెట్ వర్క్ ఉంది మరియు దేశవ్యాప్తంగా తన ఉనికిని శక్తివంతం చేయడం పై దృష్టిసారించింది.
కియా కార్పొరేషన్ గురించి
కియా (www.kia.com) అంతర్జాతీయంగా సంచరిస్తున్న బ్రాండ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు, సమాజాలు, వర్గాలకు సుస్థిరమైన ప్రయాణం పరిష్కారాలను తయారు చేయాలని కలలు కంటున్న బ్రాండ్. 1944లో స్థాపించబడిన, కియా 75 సంవత్సరాలకు పైగా ప్రయాణ పరిష్కారాలను అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 52,000 మంది ఉద్యోగులతో, 190 మార్కెట్లలో తన ఉనికితో, ఆరు దేశాలలో తయారీ సదుపాయాలతో, కంపెనీ నేడు సుమారు మూడు మిలియన్ వాహనాలను ఏటా విక్రయిస్తుంది. కియా ఎలక్ట్రిపైడ్ మరియు బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాచుర్యం కల్పించడానికి ప్రయత్నిస్తోంది మరియు ప్రయాణ సేవలు యొక్క పెరుగుతున్న శ్రేణిని అభివృద్ధి చేస్తోంది, ప్రయాణించడానికి ఉత్తమమైన విధానాలు అన్వేషించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది ప్రజలను ప్రోత్సహిస్తోంది. కంపెనీ వారి బ్రాండ్ నినాదం - 'ప్రేరేపించే సంచారం' - తన ప్రోడక్ట్స్ మరియు సేవలు ద్వారా వినియోగదారులను ప్రేరేపించడానికి కియా యొక్క కట్టుబాటును ప్రతిబింబిస్తోంది. మరింత సమాచారం కోసం, కియా గ్లోబల్ మీడియా సెంటర్ ను www.kianewscenter.com పై చూడండి.