Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్లాట్ ఫాం పై సుమారు 6.5 లక్షల మంది విక్రేతలతో మరియు 16 కోట్ల జీఎస్టీ సదుపాయం గల ఉత్పత్తులతో, అమేజాన్ బిజినెస్ హైదరాబాద్ లో వ్యాపార కస్టమర్స్ కోసం అమేజాన్ బిజినెస్ ప్రధానమైన వేదికగా నిలిచింది. 2017లో ఆరంభించబడిన అమేజాన్ బిజినెస్ హైదరాబాద్ నుండి నమోదవుతున్న కస్టమర్స్ లో 12% పెంపుదల సహా టైర్ 2 పట్టణాలలో అభివృద్ధి సాధించింది. ఎంఎస్ఎంఈలకు సాధికారత కలిగించాలనే కలతో, అమేజాన్ బిజినెస్ సేకరణ ప్రక్రియను సరళం చేసి మరియు తమ సేకరణ బడ్జెట్ కు ఉత్తమంగా సరిపోయే విక్రేత నుండి ఎంఎస్ఎంఈలు కొనుగోలు చేయడంలో సహాయపడటాన్ని కొనసాగిస్తోంది.
Text Box: హైదరాబాద్ లో ప్రముఖ పోకడలు: ● నమోదైన కస్టమర్స్ సంఖ్యలో 12% yoy పెంపుదల ● హైదరాబాద్ నుండి ఏబీ తెచ్చిన అకౌంట్స్ సంఖ్యలో 72% పెంపుదల ● అకౌంట్స్ లో వ్యయం చేయడం ద్వారా 27% పెంపుదల ● హైదరాబాద్ నుండి అందుకున్న ఆర్డర్స్ లో 38% పెంపుదల ● ఈ సంవత్సరంలో లభ్యమైన 16 కోట్ల జీఎస్టీ ఎంపిక నేపధ్యంలో ఇదంతా సాధ్యమైంది.
అమేజాన్ బిజినెస్ ప్రస్తుతం భారతదేశంలో అతి పెద్ద జీఎస్టీ - సదుపాయం గల ఎంపికను కలిగి ఉంది మరియు తమ కస్టమర్ బ్యాక్ వర్డ్ విధానం ద్వారా తమ ఇప్పటికే ఉన్న మరియు సంభావ్య యూజర్స్ కు సహాయం అందచేయడం ద్వారా అభివృద్ధిని స్థిరపరచడానికి మరియు మరింతగా వ్యాపారం చేసే విధానం సరళం చేయడానికి ప్రణాళిక చేసింది. ఈ ప్రయత్నాలకు అనుగుణంగా, అమేజాన్ బిజినెస్ కస్టమర్ అకౌంట్స్ సంఖ్యలో 72% పెంపుదలను, అకౌంట్స్ ద్వారా ఖర్చు చేయడంలో 27% పెంపుదలను, ఆర్డర్స్ అందుకోవడంలో 38% పెంపుదలను పొంది తమ సేవలను విశ్వసించే కస్టమర్స్ సంఖ్యను పెంచుకుంది.
ఇది ఆరంభమైన నాటి నుండి, తమ కస్టమర్స్ కోసం డిజిటలీకరణను ప్రోత్సహించడానికి దృష్టి కేంద్రీకరించింది మరియు వారి కోసం సేకరణ ప్రక్రియను సరళం చేసింది. కస్టమర్స్ యొక్క అభివృద్ధి చెందుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకని, 'బిల్ టు షిప్ టు' వంటి కొత్త ఫీచర్స్ చేర్చడాన్ని కొనసాగించింది. ఇది భారతదేశంవ్యాప్తంగా షిప్ మెంట్స్ కోసం తమ బిల్లింగ్ చిరునామా పై జీఎస్టీ క్రెడిట్ క్లెయిమ్ చేయడానికి కస్టమర్స్ కు అవకాశం ఇస్తుంది. 2022 ఆరంభంలో, బిజినెస్ కస్టమర్స్ ప్రయాణిస్తూనే సేకరణ అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేకించి ఆండ్రాయిడ్ మరియు iOS ఆప్టిమైజ్డ్ మొబైల్ యాప్ ను రూపొందించింది. భాగస్వామ విక్రేత కోసం, అమేజాన్ బిజినెస్ లక్షలాది వ్యాపార కస్టమర్స్ ఆవశ్యకతలకు సేవలు అందించి, వారి ఆదాయాలను పెంచడం ద్వారా బీ2బీ వ్యాపారాన్ని పెంచడానికి amazon.in పై అదనపు అవకాశాన్ని కూడా కేటాయించింది. 'రిక్వెస్ట్ ఫర్ క్వాంటిటి డిస్కౌంట్' వంటి ఫీచర్స్ మరియు భారీ కొనుగోళ్లు పై డిస్కౌంట్స్ దేశంలోని వ్యాపారాలు నుండి లక్షలాది ఆర్డర్స్ కు సేవలు అందించడానికి విక్రేతలకు సహాయపడింది.
"వినియోగదారుల పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి ఎంఎస్ఎంఈలు డిజిటల్ పరిష్కారాలను ఆరంభించాయి. ఉత్పత్తులను విక్రయించడమైనా లేదా వ్యాపార సరఫరాలు కోసమైనా, డిజిటలీకరణ అనేది అభివృద్ధిని కలిగించే చర్య. పూర్తి సంవత్సరం అంతటా మా బిజినెస్ కస్టమర్స్ నుండి మేము అందుకున్న సానుకూలమైన ప్రతిస్పందనకు మేము ఎంతగానో ఆనందిస్తున్నాము. ఎంఎస్ఎంఈ రంగానికి సానుకూలంగా తోడ్పడటానికి మేము చేస్తున్న ప్రయత్నాలకు మా అభివృద్ధి అనేది ఒక నిదర్శనంగా నిలిచింది. ఈ ఏడాది, మా కస్టమర్స్ మరియు విక్రేత భాగస్వాములు తమ వ్యాపార కొనుగోళ్లు పై మరింత ఎక్కువగా ఆదా చేసి మరియ వారి లాభాన్ని పెంచడానికి అమేజాన్ బిజినెస్ ను ప్రభావితం చేయడంలో మేము మా కస్టమర్స్ కు సహాయపడటాన్ని కొనసాగిస్తాము" అని సుచిత్ సుభాశ్, డైరక్టర్, అమేజాన్ బిజినెస్ అన్నారు."
ఎంఎస్ఎంఈలకు మరింత సాధికారత చేకూర్చడానికి మరియు మొత్తం ఖర్చులను తగ్గించడం ద్వారా తమ పరోక్ష ఖర్చులను ప్రభావవంతం చేయడానికి మరియు వ్యాపార సౌలభ్యతను మెరుగుపరిచే తమ కల పై 2023లో, అమేజాన్ బిజినెస్ మరింత శక్తివంతంగా దృష్టి సారించింది. మల్టి-యూజర్ అకౌంట్స్ మరియు ఆమోదాలు, వ్యయ విశ్లేషణలు, క్రెడిట్ విస్తరణ, వ్యయ విభజన అందుబాటులో ఉండటం ఇంకా ఎన్నో ఫీచర్స్ తో, అమేజాన్ బిజినెస్ కస్టమర్ - బ్యాక్ వర్డ్ విధానంతో తమ గరిష్ట సంభావ్యతను నవీకరించడానికి కృషి చేస్తోంది.