Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సికె బిర్లా గ్రూప్‌లో భాగమైన ఓరియెంట్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ బీఎల్డీసీ టెక్నలాజీ శ్రేణీ ఫ్యాన్ల అమ్మకాలపై అధికంగా దృష్టి కేంద్రీకరించినట్లు ఆ సంస్థ తెలిపింది. వినియోగ దారులకు ఇంధన సామర్థ్యం కలిగిన, అత్యంత అందుబాటు ధరల్లోని పరిష్కారాలను అందించాలనే లక్ష్యంతో వీటిని విడుదల చేసినట్లు పేర్కొంది. సాధారణ ఫ్యాన్లతో పోలిస్తే ఓరియెంట్ యొక్క 5 స్టార్ రేటెడ్ బీఎల్డీసీ ఫ్యాన్లు 50 శాతం వరకూ తక్కువ విద్యుత్‌ను వినియోగించుకుంటాయని ఓరియెంట్ ఎలక్ట్రిక్ ఎండీ, సీఈఓ రాజన్ గుప్తా తెలిపారు.