Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 శాతం పడిపోయిన షేర్లు
న్యూయార్క్ : అమెరికన్ బిలియనీర్ కార్ల్ ఐకాన్ అక్రమాల పై హిండెన్‌బర్గ్ గురి పెట్టింది. ఇంధనం నుంచి ఫార్మా రంగాల్లో ఉన్న కార్ల్ ఐకాన్‌కు చెందిన ఐకాన్ ఎంటర్ప్రైజెస్ లోపాలను ఎత్తి చూపింది. దీంతో మంగళవారం ప్రీ ట్రేడింగ్‌లోనే ఆ కంపెనీ షేర్లు 10 శాతం పడి పోయాయి. ఐఇపి యూనిట్స్ విలువను ఆ కంపెనీ 75 శాతం ఎక్కువగా చేసి చూపిందని హిండెన్‌బర్గ్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. నికర ఆస్తి విలువ కంటే ఇటీవల ఐకాన్ 218 శాతం ప్రీమియం ట్రేడింగ్ అవుతోందని విమర్శించింది. ఆ సంస్థ పోంజీ తరహా ఆర్థిక విధానాన్ని కలిగి ఉందని తెలిపింది. కాగా.. హిండెన్‌బర్గ్ అరోపణలపై ఐకాన్ ఎంటర్ప్రైజెస్ స్పందించలేదు. ఈ ఏడాది జనవరిలో అదాని ఎంటర ్ప్రైజెస్ అక్రమాలపై హిండెన్‌బర్గ్ విడుదల చేసిన రిపోర్ట్‌తో అదాని గ్రూపు కంపెనీల మార్కెట్ మార్కెట్ కాపిటలైజేషన్ 100 బిలియన్ డాలర్లు తుడుచుకు పెట్టుకుపోయిన విషయం తెలిసిందే.