Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ : నెల్లూరులోని ఆకాష్ బైజూస్ విద్యార్థులు ఇద్దరు ఇటీవల జరిగిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జెఈఈ) 2023 మెయిన్‌లో 99 పర్సంటైల్ మరియు ఆపైన సాధించారు. ఈ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ సంస్థ ఇటీవల వెల్లడించింది. అశోక్ 99.40 పర్సంటైల్ సాధించగా ఎం వి సుశాంత్ 99.06 పర్సంటైల్ సాధించి తల్లిదండ్రులతో పాటుగా ఇనిస్టిట్యూట్‌కు గర్వకారణంగా నిలిచారు. ప్రపంచంలో అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షగా భావిస్తోన్న ఐఐటీ జెఈఈలో విజయం సాధించేందుకు వీరు ఆకాష్ బైజూస్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. కాన్సెప్ట్‌లను అర్ధం చేసుకోవడంలో తాము పడిన కష్టం, లెర్నింగ్ షెడ్యూల్స్కు కట్టుబడి ఉండటమే టాప్ పర్సంటైల్ సాధించిన ఎలైట్ జాబితాలో చోటు సంపాదించుకోవడానికి కారణంగా విద్యార్థులు అభివర్ణించారు. విద్యార్థులను అభినందించిన ఆకాష్ బైజూస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అభిషేక్ మహేశ్వరి మాట్లాడుతూ ‘‘అసాధారణ ప్రతిభ కనబరిచిన విద్యార్ధులను అభినందిస్తున్నాను. పర్సంటైల్ టాపర్‌గా వీరు సాధించిన విజయం , వారు పడిన కష్టం, అంకితభావం మరియు అతని తల్లిదండ్రులు అందించిన మద్దతు గురించి ఎంతో వెల్లడిస్తుంది. భవిష్యత్‌లో మరిన్ని విజయాలను వారు సాధించాలని ఆకాంక్షిస్తున్నాము’’ అని అన్నారు.