Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5 శాతం పడిపోయిన షేర్
న్యూఢిల్లీ : అదాని గ్రూపులోని వంట నూనెల కంపెనీ అదాని విల్మర్ బలహీన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2022-23) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రూ.93.6 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. ఇంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.234.29 కోట్ల లాభాలు సాధించింది. దీంతో పోల్చితే గడిచిన క్యూ4 లాభాల్లో 60 శాతం పతనం చోటు చేసుకుంది. వంట నూనెల అమ్మకాలు తగ్గడంతో లాభాలు తగ్గాయి. క్రితం క్యూ4లో కంపెనీ రెవెన్యూ, అమ్మకాలు 7శాతం పతనమై రూ.13,872 కోట్లుగా నమోదయ్యాయి. 2021-22 ఇదే క్యూ4లో రూ.14,917 కోట్ల రెవెన్యూ సాధించింది. అదాని విల్మర్ నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించడంతో ఆ కంపెనీ షేర్ పడిపోయింది. బుధవారం బిఎస్ఇలో అదాని విల్మర్ షేర్ 4.30 శాతం పతనమై రూ.397.65 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏకంగా 6.11 శాతం కోల్పోయి రూ.390.10 కనిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది.