Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు వారంలో ఐదు పని దినాలకు పరిమితం కానున్నాయి .దీనికి త్వరలోనే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలుప నుందని సంబంధిత వర్గాలు తెలి పాయి. ఐదు రోజుల పని అమ లు కోసం ఎప్పటి నుంచో బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి ఇటీవల ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఉ), యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్ (యుఎఫ్బిఇ) మధ్య సూత్రప్రాయ అంగీకారం కుదిరింది. అయితే రోజుకు 40 నిమిషాలు పని వేళలు పెరగనున్నాయి. ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుందని సమాచారం. ప్రస్తుతం రెండు, నాలుగవ శనివారాలో బ్యాంక్‌లకు సెలవు ఉంటుంది. నాలుగు రోజుల పని దినాలకు ఆర్థిక శాఖ ఆమోదం లభించగానే అన్ని శనివారాలు బ్యాంక్‌లు మూత పడనున్నాయి.