Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : భారతదేశపు అతిపెద్ద మరియు అత్యంత విశ్వసనీయమైన ఉన్నత విద్యా ఎకోవ్యవస్థ అయిన CollegeDekho, తన తాజా ఆవిష్కరణ Career Compass ను ప్రారంభించింది. కంపెనీ యొక్క విద్యార్థి-ముందు అనే ధోరణికి అనుగుణంగా, Career Compass విద్యార్థులకు వ్యక్తిగత వ్యక్తిత్వ లక్షణాల ఆధారంగా కెరీర్ అవకాశాలను సిఫారసు చేయడము ద్వారా, వారి ఆందోళనను తగ్గించుటకు రూపొందించబడిన ఒక ఉచిత సాధనము. ఈ ఆఫర్ ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన ఒక హాలండ్ పర్సనాలిటి ట్రెయిట్స్ టెస్ట్ ఆధారంగా నిర్వహించబడే ఒక సైకోమెట్రిక్ పరీక్ష ఆధారితము, ఇది విద్యార్థులు తమ నిద్రాణమైన నైపుణ్యాలను వెలికి తీస్తూ మరియు సంభావ్య కెరీర్ మార్గాలను గుర్తిస్తూ కెరీర్ ఆసక్తుల గురించి మరింత అవగాహన పొందుటకు సహాయపడుతుంది. విద్యార్థులకు తమ స్థానిక భాషలలో వృత్తిపరమైన సైకోమెట్రిక్ అంచనాలను అందించవలసిన ఆవశ్యకతను CollegeDekho గుర్తించింది. తత్ఫలితంగా, ఆ ప్రాంతములో విద్యార్థుల సౌకర్యార్థం, అంచనాలను తెలుగులో అందుబాటులో ఉంచేందుకు కంపెనీ చర్యలు తీసుకుంది. Career Compass పరీక్ష CollegeDekho ద్వారా ఇన్-హౌస్ రూపొందించబడిన ఒక సాంకేతిక సాధనము ద్వారా మూడు ఉత్తమ వ్యక్తిగత లక్షణాలను గుర్తిస్తుంది. భారతదేశము కొరకు ప్రత్యేకంగా సృష్టించబడిన ఇది, కేవలం మూడు నుండి అయిదు నిమిషాల సమయం పట్టే ఒక సామాన్య పరీక్ష మరియు విద్యార్థులు తెలిసిన కెరీర్ ఎంపికలను చేసుకొనుటలో సహాయపడేందుకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మరాఠి, బెంగాలి మరియు గుజరాతి భాషలలో అందుబాటులో ఉంది. భవిష్యత్తులో ఈ పరీక్షను మరిన్ని భాషలలో ప్రారంభించాలని CollegeDekho ప్రణాళిక చేస్తోంది.
ప్రతి విద్యార్థి యొక్క ఉచిత వ్యక్తిగత Career Compass నివేదిక, సరైన లేదా తప్పు సమాధానాలు లేని పరీక్షలో ఉన్న అరవై ప్రశ్నలకు వారి వారి స్పందనలపై ఆధారపడి ఉంటుంది. ఈ నివేదికలో సంభావ్య కెరీర్ మార్గాలు, పని వాతావరణ ప్రాధాన్యతలు, మరియు ఉద్యోగ సూచనలు వంటి సహాయక సమాచారము కూడా ఉంటుంది. విద్యార్థులకు నివేదిక మరియు వారి ఆవశ్యకతల ఆధారంగా CollegeDekho యొక్క అత్యధిక అనుభవము మరియు సుశిక్షితులైన కౌన్సిలర్ల నుండి ఉచిత కస్టమైస్డ్ మర్గదర్శనము కూడా అందుతుంది, అదీ ఉచితంగానే. విద్యార్థులకు కోర్సులు మరియు 35,000 పైగా కళాశాలకు కంపెనీ వెబ్సైట్ యాక్సెస్ ఇస్తుంది. CollegeDekho అనేది ఉన్నత విద్యలో భారతదేశములోనే అతిపెద్ద ఎకోవ్యవస్థ, ఇది 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలలో 2022 సంవత్సరములో 205 మిలియన్ విద్యార్థులకు సేవలు అందించింది.
కంపెనీ యొక్క ఇటీవలి ఆఫర్ పై గర్వాన్ని వ్యక్తపరుస్తూ, CollegeDekho యొక్క CEO & సహ-వ్యవస్థాపకుడు, రుచిర్ అరోరా ఇలా అన్నారు, “CollegeDekho Career Compass ను ప్రారంభించుటకు మేము గర్విస్తున్నాము. ఇది విద్యార్థులు ఒక సరైన కెరీర్ మార్గాన్ని కనుగొనుటకు మరియు కళాశాల ప్రవేశాలకు ఉచిత మార్గదర్శకాన్ని అందుకొనుటకు సహాయపడేలా రూపొందించబడింది. ఈ విశేషత విద్యార్థులకు, ముఖ్యంగా 12వ తరగతి పూర్తి చేసి తమ కెరీర్ ఎంపికల గురించిన గందరగోళంలో ఉన్నవారికి ఎంతో సహాయకారిగా ఉంటుందని మేము విశ్వసిస్తున్నాము.”
ఇటీవల ముగిసిన 3వ టెక్నాలజి ఎక్సెలెన్స్ అవార్డ్స్ 2023 మరియు ఎడ్యుకేషన్ ఇన్నొవేషన్ సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2023 లో వరుసగా ‘బెస్ట్ ఎడ్టెక్ కంపెనీ ఆఫ్ ది ఇయర్’ మరియు ‘బెస్ట్ ఎన్రోల్మెంట్ అండ్ అడ్మిషన్స్ ప్లాట్ఫార్మ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులను CollegeDekho కైవసం చేసుకుంది.