Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గ్రామీణులు మెరుగైన జీవితాలను కొనసాగించేందుకు ఆదర్శవంతమైన ఆర్థిక భాగస్వామిగా ఉండాలని భావిస్తోంది. దేశంలోని సెమీ అర్బన్ మరియు రూరల్ లొకేషన్స్ (SURU)లో తన ఉనికిని విస్తరించేందుకు బ్యాంక్ ప్రణాళికను రూపొందించుకుంది. దృఢత్వం కలిగిన ఈ కార్యక్రమంలో భాగంగా మరిన్ని శాఖలను జోడించి, ఈ మార్కెట్ విభాగాలకు కావలసిన ఉత్పత్తులను అందతించాలని బ్యాంక్ యోచిస్తోంది. ఈ ప్రాంతాలలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 675 కన్నా ఎక్కువ శాఖలను జోడించి, వాటి సంఖ్యను 5000కి చేర్చనుంది. మార్చి 31, 2023 నాటికి, బ్యాంక్ తనకు ఉన్న 7821 శాఖలలో 52 శాతం సెమీ అర్బన్ మరియు రూరల్ లొకేషన్స్ (SURU)లోకలిగి ఉంది. సెమీ అర్బన్ మరియు రూరల్ లొకేషన్స్ (SURU)ప్రాంతాలకు బ్యాంక్ మొట్టమొదటిగా బ్యాంక్ కస్టమైజ్డ్ కార్యక్రమం ‘విషెష్’ను ప్రారంభించింది. ఇది ఆర్థిక మరియు వెల్నెస్ ప్రయోజనాల సమ్మేళనాన్ని అందిస్తుంది. సెమీ అర్బన్ మరియు గ్రామీణ ప్రాంతాలలోని వినియోగదారులకు ప్రీమియం బ్యాంకింగ్ అనుభవాన్ని అందించేలా ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు.
‘విశేష్’ ప్రోగ్రామ్ కీలక ప్రయోజనాలు:
• డెడికేటెడ్ పర్సనల్ బ్యాంకర్
• 8 మంది కుటుంబ సభ్యులకు విస్తరించవచ్చు
• గోల్డ్ లోన్ మరియు వాల్యుయేషన్: గోల్డ్ లోన్‌లో ప్రాసెసింగ్ ఫీజుపై 50% వరకు తగ్గింపు మరియు వాల్యుయేషన్‌పై 50% మాఫీ (ఏడాదికి ఒకసారి)
• నిర్మాణ సామగ్రి, ట్రాక్టర్లు, పర్సనల్, వ్యాపారం, ఆటో మరియు ద్విచక్ర వాహన రుణాలపై ప్రాసెసింగ్ ఫీజుపై 50% వరకు తగ్గింపు
• రోజువారీ హాస్పిక్యాష్ ప్రయోజనాలు (5 రోజుల వరకు)
• వార్షిక ప్రివెంటివ్ హెల్త్ చెకప్ రూ.3000
• 45+ ల్యాబ్ టెస్ట్ ప్యాకేజీలతో ఒక వార్షిక కాంప్లిమెంటరీ, నగదు రహిత ఆరోగ్య తనిఖీ
• అపరిమిత టెలి హెల్త్ కన్సల్టేషన్
• భాగస్వామ్యం ద్వారా భూసార పరీక్ష, అగ్రి అడ్వైజరీ, డ్రోన్ స్ప్రేయింగ్ మరియు అగ్రి మెషినరీ రెంటల్ వంటి అగ్రిటెక్ సేవలను అందిస్తోంది
‘‘రేపటి భారతదేశానికి భారత్ కీలకమని, భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి గ్రామీణ జీవితాన్ని మెరుగుపరచడం కీలకమని బ్యాంక్‌గా మేము విశ్వసిస్తున్నాము. మా ప్రత్యేకమైన కస్టమర్ ఎంగేజ్మెంట్ మోడల్, సెమీ-అర్బన్ మరియు గ్రామీణ ప్రాంతాలలోని వినియోగదారుల కోసం విభిన్నమైన ప్రతిపాదనలు గ్రామీణ జీవితాలను సుసంపన్నం చేయడంలో ఆదర్శవంతమైన భాగస్వామి పాత్రను పోషించేందుకు బ్యాంక్ కీలక పాత్రను పోషిస్తుంది” అని గ్రూప్ హెడ్-రిటైల్ బ్రాంచ్ బ్యాంకింగ్ అరవింద్ వోహ్రా అన్నారు.
“నేడు, మెట్రోలు మరియు టయర్ 1 నగరాలకు వెలుపల నివసిస్తున్న భారతీయులలోఎక్కువ మంది పట్టణ భారతదేశంలోని జీవన ప్రమాణాలు మరియు బ్యాంకింగ్ ఉత్పత్తులు/ఆర్థిక సేవలను కోరుకుంటున్నారు. ఈ అవసరాన్ని పరిష్కరించడంలో హెచ్డీఎఫ్సి బ్యాంక్ ముందంజలో ఉంది. ఇదే క్రమంలో ‘విశేష్’ వంటి కస్టమైజ్డ్ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడం ఈ దిశలో మరో ముందడుగు’’ అని ఆయన వివరించారు. కొత్త ఉత్పత్తులు/సేవలను ప్రారంభించడమే కాకుండా, గ్రామాల అభివృద్ధి, పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్నందున గ్రామీణ సీనియర్లైన సర్పంచ్‌లు, ఉపాధ్యాయులు, ముఖ్య అధికారులను సత్కరించడం ద్వారా ప్రత్యేకమైన కస్టమర్ ఎంగేజ్మెంట్ మోడల్‌ను బ్యాంకు రూపొందించుకుంది. భారతదేశంలోని ప్రతి జిల్లాను ఎగుమతి కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ది వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ స్కీమ్‌కు బ్యాంక్ బలమైన మద్దతుదారుగా ఉంది. తద్వారా ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా అడుగులు వేస్తుంది. ‘బ్యాంక్ ఆన్ వీల్స్’ కార్యక్రమం ద్వారా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గ్రామాలలో బ్యాంకింగ్‌ను ఇంటింటికి తీసుకెళ్లింది. ఇది ఫైనాన్షియల్ ఇంక్లూజన్ను మరింత పెంచింది. దీని ‘బ్యాంకింగ్ కీ పాఠశాల’ కార్యక్రమం సుమారు 10 లక్షల మందికి వంచనలు, ఆర్థిక అక్షరాస్యత మరియు బ్యాంకింగ్ బేసిక్స్‌పై అవగాహన కల్పించడంలో సహాయపడింది. అదనంగా, తన సీఎస్ఆర్ కార్యక్రమం-పరివర్తన్ ద్వారా, బ్యాంక్ సంపూర్ణ ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమం కింద 3335 గ్రామాలకు (23 రాష్ట్రాలలో విస్తరించిది) చేరుకుంది.