Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రయివేటు రంగంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గ్రామీణ ప్రాంతాల్లో విస్తరణపై ప్రధాన దృష్టి సారించినట్లు తెలిపింది. దేశంలోని చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో తన ఉనికిని విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆ ప్రాంతాల్లో 675 పైగా శాఖలను తెరువడం ద్వారా 5000కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. 2023 మార్చి 31 నాటికి తనకున్న 7821 శాఖల్లో 52 శాతం సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయని పేర్కొంది.