Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
తెలుగుదేశం తెలంగాణ శాఖ రాష్ట్ర నూతన కార్యవర్గంలో మరో ఇద్దరికి చోటు దక్కింది. ఉపాధ్యక్షులుగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని సనత్నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాట్రగడ్డ ప్రసూన, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నేత సామ భూపాల్ రెడ్డిని అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ నియమించారు. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలిచ్చారు. పాత రాష్ట్ర కమిటిలోనూ వీరిద్దరు ఉపాధ్యక్షులుగా పనిచేశారు. కాగా, పార్టీ రాష్ట్ర నూతన కార్యవర్గంలో మిగతా పదవులను సైతం త్వరలో భర్తీ చేసేందుకు సామాజిక, ప్రాంత, పనితీరు, తదితర సమీకరణాలను బట్టి తుది కసరత్తు చేస్తున్నట్ట్ల కాసాని జ్ఞానేశ్వర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.