Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బలమైన ఆర్డర్ బుక్ మద్దతు
హైదరాబాద్ : విద్యుత్ బస్సుల తయారీ సంస్థ ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం 2022-23లో 84 శాతం వృద్థితో రూ.1,090 కోట్ల రెవెన్యూ ఆర్జించి.. నికర లాభాల్లో 86 శాతం పెరుగుదలతో రూ.65.59 కోట్లను సాధించింది. ఇంతక్రితం ఏడాది రూ.35.35 కోట్ల లాభాలు నమోదు చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 563 విద్యుత్ బస్సులను డెలివరీ చేసింది. ఇంతక్రితం 2021-22లో 259 ఇ- బస్సులను అందించింది. ప్రస్తుతం 3,394 యూనిట్ల ఆర్డర్ బుక్‌ను కలిగి ఉన్నట్లు ఆ కంపెనీ తెలిపింది. 2022-23 మార్చితో ముగిసిన త్రైమాసి కంలో ఓలెక్ట్రా రెవెన్యూ 39 శాతం పెరిగి రూ.375 కోట్లకు చేరడంతో రూ.27.81 కోట్ల నికర లాభాలు సాధించినట్లు పేర్కొంది. ''2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ, నికర లాభాల పరంగా మెరుగైన వృద్థిని కనబర్చినందుకు సంతోషంగా ఉంది. మా తయారీ సామర్థ్యాన్ని సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించడంపై మా దృష్టి కొనసాగుతుంది. దేశ క్లీన్ మొబిలిటీ ఎజెండాకు మా వంతు సహకారం అందించడమే లక్ష్యం.'' అని ఓలెక్ట్రా గ్రీన్ టెక్ సిఇఒ కెవి ప్రదీప్ తెలిపారు.