Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఈ-కామర్స్ వేదిక మీషో మరోసారి ఉద్యోగు ల తొలగింపునకు పాల్పడింది. సాఫ్ట్‌బ్యాంక్ మద్దతు కలిగిన ఈ సంస్థ రెండో దఫాలో 251 మంది సిబ్బందికి ఉద్వాసనకు పలికింది. ఈ సంఖ్య కంపెనీ మొత్తం సిబ్బందిలో 15 శాతానికి సమానం. తొలగింపు విషయమై శుక్ర వారం ఉద్యోగులకు ఇ-మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది. గతేడాది చివరలో 150 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. తాజాగా తొలగిం పునకు గురైన సిబ్బందికి ఒకేసారి 2.5 నుంచి 9 నెలల వేతనాన్ని పరిహారంగా అందజేస్తామని ఆ కంపెనీ తెలిపింది. ఉద్యోగుల పదవి, పని చేసిన కాలం, వేతనం ఆధారంగా పరిహార ప్యాకేజీ ఉంటుందని మీషో సిఇఒ విదిత్ ఆత్రే తెలిపారు. బీమా ప్రయోజనాలను కూడా కొనసాగి స్తామన్నారు. కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవడంలోనూ సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.