Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : భారతదేశంలోని ప్రముఖ ఎడ్-టెక్ ప్లాట్‌ఫారమ్ ఫిజిక్స్ వాలా (PW), విద్యార్థుల నుంచి అందుకుంటున్న అధిక డిమాండ్‌కు ప్రతిస్పందనగా, అందరూ వేచి చూస్తున్న తన స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్ (SAT) రెండవ ఎడిషన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఫిజిక్స్ వాలా తన స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్‌ను 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రతిభావంతులైన జేఈఈ/నీట్ (JEE/NEET) అభ్యర్థులకు, విద్యాపీఠ్ కేంద్రాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకుల నుంచి అత్యుత్తమ- నాణ్యత కలిగిన కోచింగ్, మార్గదర్శకత్వం పొందేందుకు 90% వరకు స్కాలర్షిప్లను దక్కించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. నాణ్యమైన ఆఫ్‌లైన్ విద్యను సరసమైనదిగా, ప్రతి విద్యార్థికి అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో, ఫిజిక్స్ వాలా (PW) రానున్న విద్యా సంవత్సరంలో రూ.160 కోట్ల విలువైన స్కాలర్షిప్లను అందించాలని యోచిస్తోంది. ఫిజిక్స్ వాలా (PW) స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్ (SAT) తదుపరి పరీక్షలను రాబోయే దశను మే 14 వరకు నిత్యం ఆన్లైన్లో మరియు మే 7 మరియు 14 తేదీల్లో ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు. విద్యార్థులు ఫిజిక్స్ వాలా (PW) యాప్ లేదా వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో పరీక్ష రాయవచ్చు లేదా సమీపంలోని విద్యాపీఠ్ సెంటర్లో ఆఫ్‌లైన్‌లో పరీక్షకు హాజరుకావచ్చు.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఫిజిక్స్ వాలా ఇప్పటికే రూ.100కోట్ల+ కన్నా ఎక్కువ స్కాలర్షిప్లను ప్రధానం చేసింది. ఫిజిక్స్ వాలా (PW) స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్ (SAT) కోసం ఏప్రిల్ 2023 వరకు 100k (లక్ష) కన్నా ఎక్కువ మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఫిజిక్స్ వాలా (PW) స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్ (SAT)కు ఇప్పటివరకు 40,000 కన్నా ఎక్కువ మంది విద్యార్థులకు సాధికారతను కల్పించింది. ఇప్పటి టెస్టుతో మరింత ఎక్కువ మంది దీని నుంచి ప్రయోజనం పొందుతారని అంచనా.
బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, హర్యానా, జమ్మూ-కశ్మీర్, కర్ణాటక, అసోం, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో ఫిజిక్స్ వాలా (PW) స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్ (SAT) బహుళ దశల్లో నిర్వహించనున్నారు.
ఫిజిక్స్ వాలా (PW) స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్ (SAT) పరీక్ష, ఇది విద్యార్థుల మానసిక సామర్థ్యం మరియు స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్‌ను అంచనా వేస్తుంది. ఫిజిక్స్ వాలాకు చెందిన అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అభివృద్ధి చేయబడింది. ఆన్లైన్/ఆఫ్‌లైన్ పరీక్ష VIII-XII తరగతులకు సంబంధించిన గణితం, సైన్స్, మానసిక సామర్థ్యాన్ని కవర్ చేస్తుంది. అలాగే, XI మరియు XII తరగతులకు పీసీఎం/ పీసీబీ (PCM/PCB) పాఠ్యాంశాలు ఉంటాయి.
ఫిజిక్స్ వాలా వ్యవస్థాపకుడు & సీఈఓ అలఖ్ పాండే మాట్లాడుతూ, ‘‘భారతదేశ వ్యాప్తంగా అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు మరియు మెంటర్షిప్ ద్వారా అసాధారణమైన విద్యావకాశాలను అందించడంలో ఫిజిక్స్ వాల్లా తిరుగులేని నిబద్ధతకు ఫిజిక్స్ వాలా (PW) స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్ (SAT) నిర్వహణ నిలుస్తుంది. మా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ సాధ్యమైనంత ఎక్కువ మంది విద్యార్థులను శక్తివంతం చేసేలా రూపొందించాము. అందుకే మేము దీన్ని అనేక దశల్లో నిర్వహిస్తాము. ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్ పరీక్షా రీతులను ఎంచుకునే సౌలభ్యాన్ని విద్యార్థులు కలిగి ఉంటారు. రానున్న విద్యా సంవత్సరంలో, మేము రూ.160 కోట్ల విలువైన స్కాలర్షిప్లను ప్రదానం చేసేందుకు ప్రణాళికను రూపొందించుకున్నాము. ఇప్పటికే రూ.100 కోట్ల రివార్డులను ప్రతిభావంతులైన విద్యార్థులకు అందజేశాము. గత పరీక్షలో పది లక్షల కన్నా ఎక్కువ మంది విద్యార్థుల నుంచి వచ్చిన అద్భుతమైన స్పందన నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంది. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు దీని నుంచి ప్రయోజనం పొందుతారని మేము ఆశిస్తున్నాము’’ అని ధీమా వ్యక్తం చేశారు.