Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో ప్రభుత్వ రంగంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఐ) 84 శాతం వృద్ధితో రూ.571 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ4లో రూ.310 కోట్ల లాభాలు నమోదు చేసింది.
గడిచిన క్యూ4లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 45 శాతం పెరిగి రూ.3,513 కోట్ల నుంచి రూ.2,416 కోట్లకు చేరింది. వడ్డీయేతర ఆదాయం 125 శాతం వృద్ధితో రూ.1424 కోట్లుగా నమోదైంది. 2023 మార్చి నాటికి బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 8.44 శాతానికి తగ్గాయి. 2022 డిసెంబర్ ముగింపు నాటికి జీఎన్‌పీఏ 8.85 శాతంగా ఉంది. నికర నిరర్థక ఆస్తులు 2.09 శాతం నుంచి 1.77 శాతానికి తగ్గాయి.