Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ:ఇండియన్ బ్యాంక్ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవ త్సరం (2022-23) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 47 శాతం వృద్ధితో రూ.1,447 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ4లో రూ.984 కోట్ల లాభా లు ఆర్జించింది. ఇదే సమయంలో ఆ బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 11,405 కోట్లుగా ఉండగా.. గడిచిన మార్చి త్రైమాసికంలో రూ.14,238 కోట్లకు చేరింది. గడిచిన క్యూ4లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ. 9,832 కోట్ల నుంచి రూ.12,244 కోట్లకు పెరిగింది. 2023 మార్చితో ముగిసిన ఏడాదికి గాను రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతీ ఈక్విటీ షేర్‌పై రూ.8.60 లేదా 86 శాతం డివిడెండ్‌ను ఇవ్వడానికి బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 8.47 శాతం నుంచి 5.95 శాతానికి తగ్గాయి. నికర నిరర్థక ఆస్తులు 2.20 శాతం నుంచి ఏకంగా 0.90 శాతానికి దిగిరావడం విశేషం. రూ.3,000 కోట్ల నిధుల సమీకరణకు ఆ బ్యాంక్ బోర్డు ఆమోదం తెలిపింది.