Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్ విమానయాన సంస్థ దాఖలు చేసిన స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియ పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) స్వీకరించింది. దివాలా పరిష్కారకర్తగా అభిలాష్ లాల్‌కు కంపెనీ నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తూ జస్టిస్ రామలింగం సుధాకర్, జస్టిస్ ఎల్ఎన్ గుప్తా నేతృత్వంలోని ధరాస్మనం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. గో ఫస్ట్ దివాలా ప్రక్రియ కేసును వేగంగా విచారణ జరిపించాలన్న ఆ కంపెనీ విజ్ఞప్తి మేరకు ఎన్సీఎల్టీ స్పందించినట్లయ్యింది. బోర్డు ఆఫ్ డైరెక్టర్లను సస్పెండ్ చేసింది. ఆ కంపెనీ చెల్లింపులపై మారటోరియం విధించింది.