Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : భారత విదేశీ మారకం నిల్వలు మరోసారి ఆల్‌టైం గరిష్టానికి చేరాయి. జూన్ 12తో ముగిసిన వారంలో మారకం నిల్వలు 354.29 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ వారంలో 1.57 బిలియన్ డాలర్లు పెరిగాయని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వెల్లడించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డాలర్ల ప్రవాహం ఎక్కువగా చోటు చేసుకోవడం మారకం నిల్వలకు మద్దతు చేశాయని అంచనా. బంగారం నిల్వలు యథాతథంగా 19.34 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్)లో భారత మారకం 1.4 మిలియన్ డాలర్లు పెరిగి 1.31 బిలియన్ డాలర్లకు చేరాయి.