Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటాకార్ప్ అమ్మకాల్లో సరికొత్త రికార్డును చేరుకుంది. కంపెనీ మొత్తం అమ్మకాలు 7.5 కోట్ల వాహనాల మార్కును దాటేసినట్టుగా కంపెనీకి చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2020 నాటికి 10 కోట్ల అమ్మకాల మార్కును అదుకోవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. లక్ష్యానికి చేరువయ్యే విధంగానే తమ అమ్మకాలు ముందుకు సాగుతున్నట్టుగా సదరు అధికారి తెలిపారు. ప్రస్తుత పండుగల సీజన్లో రెండంకెల వృద్ధిని అందుకోవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకొని తాము ముందుకు సాగుతున్నట్టుగా హీరో కంపెనీ వర్గాలు తెలిపాయి. గత ఏడాది పండుగల సీజన్లో కంపనీ రిటైల్‌గా 10 లక్షల వాహనాలను విక్రయించింది. ఆగస్టు ఒక్క మాసంలో కంపెనీ రికార్డు స్థాయిలో దాదాపు 6.78 లక్షల వాహనాలను విక్రయించిన సంగతి తెలిసిందే.