Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: పండుగ సీజన్ సందర్భంగా ఇండియన్బ్యాంకు వాహన రుణ గ్రహితలకు పెద్ద మొత్తంలో డిస్కౌంట్లను అందిస్తోంది. సంబంధిత రాయితీలను ఎక్కువ మంది ఖాతాదారులకు అందించేందుకు గానూ జంటనగరాలలోని వాహన డీలర్లతో బ్యాంకు అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలు ప్రముఖ వాహన సంస్థల డీలర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండియన్ బ్యాంకు జోనల్ మేనేజర్ ఆర్ మనోహర్ మాట్లాడుతూ ఖాతాదారులకు అందిస్తున్న అతి తక్కువ వడ్డీ, ప్రాసెసింగ్ చార్జీల మినహాయింపులపై వారికి వివరించారు. ఈ ఆఫర్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా వాహన డీలర్లు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జోనల్ మేనేజర్ జీవీయస్ ఆర్ రామకృష్ణ శర్మ, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.