Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్యవిభాగం: పన్నులు ఎగొట్టేందుకు జీఎంఆర్ గ్రూప్ విదేశాలలో చాలా అనుబంధ సంస్థలతో సంబంధాలను నడుపుతోందంటూ వచ్చిన ప్యారడైజ్ పేపర్స్ కథనాలను జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోసిపుచ్చింది. ప్యారడైజ్ పేపర్లలో జీఎంఆర్ పేరు ప్రస్తావనను ఉటంకిస్తూ సంస్థ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలోని నియంత్రణ సంస్థల మార్గదర్శకాలకు అనుగుణంగానే తాము విదేశీ సంస్థలతో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టుగా ఆ సంస్థ పేర్కొంది. వ్యాపార విస్తరణలో భాగంగా మౌలిక సదుపాయాల రూపకల్పనలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రముఖ వ్యాపారవేత్తల భాగస్వామ్యంతో, విదేశాలలో కొన్ని అనుబంధ సంస్థలను ఏర్పాటు చేయడం జీఎంఆర్కు అవసరమని వివరించింది. కాగా వాటిని నెలకొల్పడంలో తమ సంస్థ ప్రభుత్వ నిబంధనలకు లోబడే పని చేస్తోందని తెలిపింది. ఆయా అనుబంధ సంస్థల్లోని ఆదాయాలు అందుకు సంబంధించిన పన్నులను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు జమ చేస్తూ వస్తోందని వెల్లడించింది.