Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14శాతం మేర దిగజారిన విలువ
లండన్ : క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ విలువ ఒకే రోజు భారీగా పడిపోయి నాలుగు వారాల కనిష్ట స్థాయికి దిగజారింది. మంగళవారం ఈ కరెన్సీ విలువ 14 శాతం క్షీణించి 12,000 డాలర్ల దిగువకు పడిపోయింది. దక్షిణ కొరియా ఆర్థిక శాఖ మంత్రి కిమ్ డొంగ్ యెన్ స్థానిక రేడియో స్టేషన్లో మాట్లాడుతూ అసంబద్దంగా ఉన్న క్రిప్టో కరెన్సీ పెట్టుబడులను నియంత్రించడానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో లక్షమ్బర్గ్ కేంద్రంగా పని చేస్తోన్న బిట్స్స్టాంప్ ఎక్సేంజీలో బిట్ కాయిన్ విలువ 13.6 శాతం క్షీణించి 11,730 డాలర్లుగా నమోదయ్యింది. గత డిసెంబర్ మధ్యలో ఈ కరెన్సీ విలువ ఏకంగా 20,000 డాలర్లకు చేరి దీని మార్కెట్ విలువ 125 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత కొద్ది రోజులుగా ఈ కరెన్సీపై నెలకొన్న భయాలతో దాదాపుగా 40 శాతం పైగా విలువ కోల్పోయింది.