Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్బీఐ పునరుద్ఘాటన
ముంబయి : పది రూపాయల నాణేలు చెల్లుబాటు కావంటూ వస్తున్న ఊహాగానాలపై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోమారు స్పష్టతనిచ్చింది. 14 డిజైన్లలో ఉన్న అన్ని రూ.10 నాణేలు చెల్లుబాటు అవుతాయని బుధవారం తెలిపింది. లావాదేవీలకు లీగల్ టెండర్ మనీగా వీటిని ఆమోదించాల్సిందేనని తెలిపింది. ఈ నాణేలన్నీ చట్టబద్ధంగానే కొనసాగుతాయని పేర్కొంది. వీటిని లావాదేవీల కోసం వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. కొంతమంది వ్యాపారులు ఈ నాణేలను తిరస్కరిస్తున్నారని, ఇది తమకు దృష్టికి వచ్చిందని ఆర్బీఐ పేర్కొంది.