Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: వాస్తవానికి మార్కెట్లో కొత్త కొలువులనవే కనిపించకుండా పోతు న్నప్పటికీ.. గత సెప్టెంబరు-మార్చి మధ్య (ఏడు నెలల) కాలంలో దాదాపు 39.36 లక్షల ఉద్యోగాలు కొత్తగా సృష్టించబడినట్టు ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్‌వో) సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. మార్చితో ముగిసిన ఏడు నెలల కాలంలో ఈ మేరకు కొత్తవారు కొలువుల్లోకి ఎక్కినట్టుగా ఈపీఎఫ్‌వో తెలిపింది. కేవలం ఒక్క మార్చి నెలలోనే దాదాపు 6.13 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయని భవిష్యనిధి సంస్థ తెలిపింది. గత ఫిబ్రవరిలో 5.89 లక్షల ఉద్యోగాలే కల్పించబడినట్టుగా సంస్థ తెలిపింది. కొత్తగా ఉద్యోగాల కల్పన జరిగిన రంగాలలో విద్యత్తు, యంత్రాలు, సాధారణ ఇంజినీరింగ్ ఉత్పత్తుల తయారీ రంగాలతో పాటు భవన నిర్మాణం, వాణిజ్యం, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, జౌళి రంగాలు ఉన్నట్టుగా ప్రభుత్వ శాఖ తెలిపింది. అయితే కొత్తగా సృష్టించబడిన 39.36 లక్షల కొలువుల్లో సగం ఉద్యోగాలు మహరాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లోనే నమోదైయినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. మిగతా సగం ఉద్యోగాలు మగిలిన 23 రాష్ట్రాల్లో నమోదు కావడం విశేషం. అయితే ఈపీఎఫ్‌వో విడుదల చేసిన గణాంకాలు పూర్తిగా నమ్మాల్సిన సంఖ్యలు కావని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది ఉద్యోగాలు మారి కొత్త కొలువుల్లో చేరినప్పుడల్లా ఆయా సంస్థలు వారిని ఈపీఎఫ్‌వో రోల్స్‌లో చూపిస్తూ వస్తాయని దీంతో సంఖ్య అధికంగా కనిపిస్తుందన్నది వారి వాదన. న