Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధర రూ.18.06 లక్షల నుంచి ప్రారంభం
న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన ప్రముఖ సూపర్ బైక్‌ల తయారీ సంస్థ డుకాటీ మరో కొత్త బైక్‌ను దేశీయ విపణిలోకి విడుదల చేసింది. డుకాటీ మల్టీస్ట్రాడా -1260 పేరుతో ఈ సరికొత్త బైక్‌ను సంస్థ మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. డుకాటీ రెండు వేరియంట్లలో ఈ బైక్‌ను తీసుకొచ్చింది. మల్టీస్ట్రాడా 1260 వేరియంట్ ధర రూ. 15.99 లక్షలు (ఎక్స్‌షోరూం, ఢిల్లీ), మల్టిస్ట్రాడా -1260ఎస్ వేరియంట్ ధరను రూ.18.06లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. భారత్‌లో తమ మార్కెట్‌ను విస్తరించుకునేందుకు సరికొత్త మోడళ్లు తీసుకొస్తున్నట్లు డుకాటీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సెర్గీ కానోవస్ ఈ సందర్భంగా ప్రకటనలో తెలిపారు. ఉత్తమమైన ఇటాలియన్ డిజైన్, ఇంజినీరింగ్, పర్ఫార్మెన్స్ గల బైక్‌లను భారత రోడ్లపైకి తీసుకొచ్చేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందన్నారు. అందులో భాగంగానే మల్టిస్ట్రాడా 1260, 1260ఎస్ మోడళ్లను భారత మార్కెట్లోకి విడుదల చేశామన్నారు. ఇప్పటికే భారత్‌లో డుకాటీ నుంచి మల్టిస్ట్రాడా 950, మల్టిస్ట్రాడా 1200 మోడళ్లు బైక్‌లు అందుబాటులో ఉన్నాయని వివరించారు.