Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: స్వీడన్‌కు ఫర్నీచర్ దిగ్గజం ఐకియా భారత్‌లో తన తొలి స్టోర్ ప్రారంభించే విషయం మరోమారు వాయిదా పడింది. ఐకియా భారత్‌లో మొట్టమొదటి సారిగా హైదరాబాద్‌లో తన స్టోర్‌ను ఈ నెల 19న ప్రారంభించాలని నిర్ణయించింది. అయితే ఇప్పుడు దీనిని మరో 20 రోజల పాటు వాయిదా వేస్తున్నట్టగా సంస్థ శుక్రవారం తాజాగా తెలిపింది. తమ సంస్థ ఇంకా కొన్ని నాణ్యతపరమైన కట్టుబాట్లను పూర్తి చేయాల్సి ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సంస్థ వివరించింది. వీటన్నింటిని పూర్తి చేసుకొని వచ్చే నెల (ఆగస్టు) 9న స్టోర్‌ను ప్రారంభించాలని నిర్ణయించినట్టుగా సంస్థ వెల్లడించింది. వినియోగదారులకు ఉత్తేజకరమైన, సురక్షితమైన అనుభవాన్ని సొంతం చేసేందుకు గాను ఐకియా ఎప్పుడు పెద్దపీట వేస్తుందని సంస్థ తెలిపింది. ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తెస్తున్న ఐకియాను భారత్‌లోని ఎక్కువ మంది వినియోగదారుల అంచానాలకు దగ్గర చేయాలన్నదే తమ ద్యేయమనిసంస్థ సీఈవో పీటర్ బెట్జెల్ తెలిపారు.