Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ఎయిర్ కండీషనింగ్ దిగ్గజం బ్లూస్టార్ పలు విమానా శ్రయాలు, మెట్రో విభాగాల్లో ఇంజి నీరింగ్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్కు (ఈఎఫ్ఎం) సంబంధించిన ప్రతిష్టా త్మకమైన ఆర్డర్లను సొంతం చేసుకుంది. వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రీ టెర్మినల్ బిల్డింగ్,33 కేవీ సామర్థ్యం కలిగిన సబ్‌స్టేషన్‌కు చెందిన ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇన్స్టలేషన్ పనులను బ్లూస్టార్ సొంతం చేసుకుంది. దీనికి తోడు కొయంబొత్తూరులోనిఎయిర్పోర్ట్ అథారిటీకి చెందిన అంతర్జాతీయ విమానాశ్రయంలో విద్యుత్తు ఏసీ ఆపరేషన్, నిర్వహణ పనులను కూడా సంస్థ తన ఖాతాలో వేసుకుంది. దీనికి అదనంగా చెన్నై మెట్రో రైలుకు చెందిన మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్కు చెందిన ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఆర్డరును కూడా సంస్థ సొంతం చేసుకుంది. వీటితో పాటుగా సంస్థ లక్నోలోని సీసీఎస్ ఎయిర్‌పోర్టులో విద్యుత్తు, మెకానికల్ ఇన్ట్స్లేషన్, మెయింటనెన్స్ పనులను కూడా సొంత చేసుకొంది. ఈ మొత్తం ఆర్డర్ల విలువ రూ.25 కోట్లు మేర ఉంటుందని సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ బి. త్యాగరాజన్ తెలిపారు.