Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలిఫోర్నియా: హెచ్ ఎండీ గ్లోబల్ సంస్థ నోకియా సీరిస్ లో పలు అద్భుత ఫీచర్లతో కూడిన 'బాహుబలి' ఫోన్‌ను అందు బాటులోకి తేనుంది. 'నోకియా 9' స్మార్ట్‌ఫోన్ కు సంబంధించిన కొన్ని ఫొటోలు ఆ మధ్య లీక్ అయ్యి వైరల్‌గా మారాయి. నోకియా పవర్ యూజర్ వెబ్సైట్లోనూ ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు, ఫొటోలు ఉన్నాయి. ఈ ఫొటోల్లో ఫోన్‌కు వెనుకవైపు ఐదు లెన్స్‌ల కెమెరా సెటప్ ఉంది. అంతేగాక.. ఈ ఫోన్లో అత్యంత సమర్థమంతమైన 4,150 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరుల నెలాఖరులో ఫోన్‌ను విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నిజానికైతే ఇప్పటికే ఈ ఫోన్‌ను విడుదల చేయాల్సి ఉండగా.. పెంటా లెన్స్ కెమెరా వల్లే ఆలస్యమైందట. ఇక ఈ ఫోన్లో ముందువైపు మూడు కెమెరాలుండనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అలాగైతే నోకియా 9లో మొత్తంగా 8 కెమెరాలున్నట్లు అవుతుంది. నోకియా 9 'ఆండ్రాయిడ్ పై' ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేయనున్నట్టుగా సమాచారం. అంతేగాక.. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 6.01 అంగుళాల డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845ఎస్ఓసీ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ మెమొరీ తదితర భారీ ఫీచర్లు ఈ ఫోన్ ప్రత్యేకమని తెలుస్తోంది. వచ్చే నెలలో ఈ ఫోన్ భారత మార్కెట్లోకి రానుంది.