Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో సంస్థ త్వరలో అందుబాటులోకి తేనున్న ఫైబర్ ఆధారిత అత్యాధునిక కేబుల్ ప్రసారాల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొనేందుకు గాను ఎయిర్టెల్ కొత్త సంస్థలతో జట్టు కడుతోంది. తాజాగా ఆ సంస్థ సెట్‌టాప్ బాక్స్ ఆధారంగా డిజిటల్ సేవలను అందించేందుకు, ఇంటర్నెట్ టీవీ సేవల కోసం టాటా ఎలెక్సీ సంస్థతో జట్టు కట్టింది. ఈ కొత్త భాగస్వామ్యంలో భాగంగా టాటా ఎలెక్సీ సంస్థ ఎయిర్టెల్ అనుబంధ సంస్థ ఎయిర్టెల్ డీటీహెచ్‌కు సంబంధించిన హైబ్రిడ్ సెట్‌టాప్ బాక్స్‌లకు, ఇంటర్నెట్ టీవీకి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి అందించనుంది. అయితే ఈ భాగస్వామ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇరు సంస్థలు అధికారికంగా వెల్లడించలేదు. ఖాతాదారులకు తదుపరితరం అనుభవాల ఆవిష్కరణలను అందించే నిమిత్తం ఇరు సంస్థలం కలిసి పని చేయనున్నట్టుగా టాటా ఎలెక్సీ బ్రాడ్కాస్ట్ వ్యాపారపు ఉపాధ్యక్షుడు, అధినేత అయిన కె.పి.శ్రీకుమార్ తెలిపారు. కృత్రిమ మేథస్సు, మల్టీ మోడల్ ఇంటర్ఫేస్, ధ్వని, కదలికల ఆధారంగా టీవీ నెట్వర్క్ పని చేసే విధంగా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా టీవీ కంటెంట్ మిస్‌కాకుండా నెట్వర్క్ బ్రాడ్‌కాస్టింగ్‌ను ప్లాన్ చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు.