Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెజాన్ ఏదో ఒకరోజు దివాళా తీయొచ్చు
సియాటెల్: ప్రపంచ ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ ఏదో ఒకరోజు దివాళా తీయొచ్చని ఆ కంపెనీ సీఈఓ జెఫ్ బెజోస్ ఉద్యోగులకు వెల్లడించారు. కంపెనీ భవితవ్యంపై ఆ సంస్థ ఉద్యోగులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టెక్ షేర్లు కుప్పకూలిపోవడంతో బెజోస్ 9.1 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయిన సంగతి తెలిసిందే. 'అమెజాన్ కూడా ఒకరోజు విఫలం కావొచ్చు. ఒకప్పటికి అది దివాళా తీస్తుందని అనుకుంటున్నా. ఒకసారి పెద్ద కంపెనీలను పరిశీలించండి. వాటి జీవితకాలం 30 సంవత్సరాలు ఉంటుంది. వంద సంవత్సరాలకు పైగా అవేమీ మనుగడ సాగించడం లేదు' అని ఆ సమావేశంలో వెల్లడించారు. అయితే ఉద్యోగులు ఆ జీవిత కాలాన్ని పొడిగించేలా పనిచేయాలి. వినియో గదారుల మనసు తెలుసుకోగలిగితేనే ఇది సాధ్యమవుతుందని అన్నారు. వినియోగదారుల మీద కాకుండా మన మీద మాత్రమే దృష్టి సారించుకుంటే మన పతనం మొదలయినట్లే. జీవిత కాలాన్ని సాధ్యమైనంత పొడిగించడానికి ప్రయత్నించాలి' అని అతడు ఉద్యోగుల పనితీరును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.