Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: తక్కువ కనెక్టివిటీ కలిగిన ప్రదేశాలకు నమ్మకమైన ప్రయాణాన్ని చేరువ చేసేందుకు గాను ఉబేర్ సంస్థ 'ఉబేర్ లైట్' ప్లాట్‌ఫామ్‌పైకి సరికొత్త సదుపా యాలను సంస్థ అందుబాటులోకి తీసుకు వచ్చింది. తాజాగా సంస్థ ఉబేర్ లైట్ వేదికపైకి ఉబేర్ పూల్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనికి తోడు డిజిటల్ పేమెంట్ సదుపాయం పేటీఎంను కూడా ఉబేర్ లైట్‌తో సంస్థ అనుసంధానం చేసింది. క్యాబ్ బుకింగ్‌లు మరింత సులువుగా, వేగంగా జరిపేందుకు వీలుగా ఉబేర్ లైట్‌ను సంస్థ మరిన్ని హంగులతో ఆధునీకరించింది. సరికొత్త ఉబేర్ లైట్ యాప్‌లో బుకింగ్ ప్రక్రియ వేగవంతంగా సాగించేందుకు గాను కేవలం 5 ఎంబీ లోపు (కేవలం మూడు సెల్ఫీలతో సమానమైన) స్థలంలో సర్దుకొని.. కేవలం 300 మిల్లీ సెకండ్స్ సమయంలో కనెక్టయ్యేలా సంస్థ యాప్‌ను ఆధునీకరించింది. ఆండ్రాయిడ్ ఫోన్లకు మరింత వేగంగా పని చేసేలా దీనిని రూపొందించినట్టుగా సంస్థ తెలిపింది.