Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: అమెరికాలో ట్రంప్ సర్కారు అధికారంలోకి వచ్చాక అమెరికాలో శాశ్వత నివాస యోగ్యత (గ్రీన్కారు)నిబంధనలు కఠినతర మయ్యాయి. దీంతో గ్రీన్‌కార్డు కొనుగోళ్లకు డిమాండ్ గణనీయంగా పెరిగిపోతోంది. ఇటీవలి కాలంలో అమెరికాలో క్యాష్ ఫర్ గ్రీన్‌కార్డ్ లేదా పెట్టుబడి వీసాలుగా పరిగణించే ఈబీ 5 వీసాలకు డిమాండ్ బాగా పెరిగింది. అమెరికాలో ఈ తరహా గ్రీన్‌కార్డులను పొందుతున్న వారిలో భారతీయులే అత్యధికంగా ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన రెండేండ్ల కాలంలో భారతీయులు పొందిన ఈ తరహా గ్రీన్‌కార్డుల సంఖ్య దాదాపు మూడు రెట్టు పెరిగినట్టుగా అమెరికా ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది సెప్టెంబరుతో ముగిసిన ఏడాది కాలానికి అమెరికాలో పెట్టుబడి వీసాలను పొందిన వారి సంఖ్య 585కు చేరింది. అంతకు ముందు ఏడాది ఇది కేవలం 174గా ఉంది. 2016లో ఈ సంఖ్య కేవలం 149గా మాత్రంగానే ఉంది. దీంతో గడిచిన రెండేండ్ల కాలంలో ఈ తరహా విసాల సంఖ్య 293% మేర పెరిగినట్టయింది. అమెరికాలో ఉన్న నిబంధలన మేరకు ఈ తరహా వీసాలను పొందేందుకు గాను పది లక్షల డాలర్ల పెట్టుడి, కనీసం 10 మందికి స్థానికులకు ఉపాధి కల్పిస్తే చాలు. ఇటీవలి కాలంలో అమెరికా సరాకరు పెట్టుబడి మొత్తాన్ని పది నుంచి అయిదు లక్షల డాలర్లకు తగ్గించింది. దీంతో ఈ తరహా వీసాలను కొరుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.