Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: మీడియా సర్వీస్ ప్రొవైడర్ హాట్‌స్టార్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్, అమె జాన్ ప్రైమ్ వీడియో లాంటి పోటీ సంస్థలకు షాకిస్తూ తాజాగా వీఐపీ సబ్స్క్రిప్షన్ పేరుతో సరికొత్త ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. సంవత్సరానికి రూ.365 సబ్‌స్క్రిప్షన్‌తో వీఐపీ ప్లాన్‌ను హాట్‌స్టార్ ప్రకటించింది. రానున్న ఐపీఎల్, ఐసీసీ వరల్డ్ కప్ నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సంస్థ ఈ ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ కొత్త ఆఫర్లో ఐపీఎల్ 2019 క్రికెట్ మ్యాచ్‌లు, టీవీ షోలు, సరికొత్త సినిమాలను వీక్షించే వీలుంది. వివో ఐపీఎల్, ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, ఫార్ములా 1 వంటి ప్రీమియర్ లీగ్స్ అన్నింటిని ఈ హాట్‌స్టార్ వీఐపీ టారిఫ్ కింద వీక్షించవచ్చని సంస్థ తెలిపింది. అది కూడా ఏడాదికి రూ.365కి మాత్రమే. అంటే రోజుకు రూ.1 మాత్రమే ననని సంస్థ తెలిపింది. హాట్ స్టార్ వీఐపీ సబ్స్క్రైబర్స్ స్టార్ నెట్వర్క్ ఛానెల్స్ ప్రసారమయ్యే సీరియల్స్‌ని టీవీలో ప్రసారం అవడానికన్నా ముందే వీక్షించే అవకాశం వుండటం మరో విశేషం. అలాగే ఇప్పటికే చందాదారులుగా వున్నవారు ఈ ప్లాన్‌తో అప్డేట్ చేసుకోవ చ్చు.అంతేకాకుండా అమెరికాకు చెందిన అన్ని టీవీ షోలు, ఇంటర్నేషనల్ సినిమాలు ఈ ఆఫర్‌కి వర్తించవు.